నా బాడీలో ఆ పార్ట్‌ను చూపించమని దర్శకుడు బలవంతం చేశాడు..స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది. సీనియర్ నటి జయలలీత ఇటీవలే తన కెరీర్‌లో ఎదురైన వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో పెద్దవాళ్లుగా ఉన్న వ్యక్తుల చేతుల్లో కొన్నిసార్లు నలిగిపోవాలి వచ్చిందని ఆమె నేరుగా చెప్పడం జరిగింది.
సినిమాలో ఆఫర్లు, కమిట్మెంట్‌ల గురించి బిగ్‌బాస్ నటి హిమజ సైతం స్పందించారు. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయనేది ఓ రూమర్ మాత్రమే అని హిమజ తెలిపారు. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు.. అలాగే అవకాశాలు వచ్చిన వారందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని హిమజ చెప్పుకొచ్చారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. 1990ల్లో ఆమని కూడా టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. సౌందర్య, రాశీ, రోజా, రమ్యకృష్ణ వంటి వారు గ్లామర్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న సమయంలో ఆమని హోమ్లీగా కనిపించి అభిమానులను అలరించారు.

జంబలకిడిపంబ,శుభలగ్నం,శుభసంకల్పం,ఆ నలుగురు,పచ్చని సంసారం,ప్రియమైన శ్రీవారు, మావిచిగురు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.ప్రస్తుతం తెలుగు , తమిళ కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారామె. ఆమని తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టారు. నా కెరీర్ తొలినాళ్లలో చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఆమె తెలిపారు.
ఓ తమిళ దర్శకుడు నన్ను ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అంటూ బహిరంగంగా అడిగాడు..దీంతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు. బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్లు కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారని ఈ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చారు. పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో నటీనటులతో చాలా బాగా ఉంటారని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారని ఆమని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాల విషయంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటాయని ఆమని పేర్కొన్నారు. జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని.. నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమని తెలిపారు.


Click it and Unblock the Notifications











