ఆ ఇద్దరు ఎవరు? కాందబరి జెత్వానీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ముగ్గురు పోలీస్ బాస్‌లకు ఉచ్చు

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై భూటకపు కేసు, కిడ్నాప్, లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురి చేసిన అంశాల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయనే విషయాన్ని ఆమె తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఉద్దేశ పూర్వకంగా ఆమెపై కేసు నమోదు చేసి చిత్రవధకు గురి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును భూటకపు కేసుగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు. ఈ కేసులో సంచలన వివరాల్లోకి వెళితే..

తనపై దారుణంగా వ్యవహరించడమే కాకుండా 70 ఏళ్లకుపై బడిన తల్లిదండ్రులను ముంబై నుంచి 15 గంటలపాటు వాహనం ప్రయాణించేలా చేసి హింసించారు అని తొలుత ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం ఏపీ పోలీస్ అధికారుల రక్షణను ఏర్పాటు చేసి ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసి తన బాధను వెల్లబోసుకొన్నారు.

Kadambari Jethwani

ఆమె తరుఫున లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. నటి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదును కమిషనర్ పరిగణనలోకి తీసుకొన్నారు. తనకు జరిగిన అన్యాయం, తప్పుడు కేసులు పెట్టడం, ఆస్తులు సీజ్ చేయడం లాంటి అంశాలను కమిషనర్‌కు వివరించారు. స్పెషల్ టీమ్‌ ఈ వివరాలను రికార్డు చేస్తున్నది.

కాదంబరి జెత్వానీ ఫిర్యాదుపై కమిషనర్ స్పందించారు. దాదాపు బాధితురాలికి సంబంధించిన 18 బ్యాంక్ అకౌంట్లను సీజ్ నుంచి ఫ్రీ చేస్తున్నారు. ముంబైలోని ఆమె ఫ్లాట్‌ను అప్పగించే పనిలో ఉన్నారు. అలాగే ఆమె నుంచి స్వాధీనం చేసుకొన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని లాయర్ తెలిపారు.

అయితే తన స్టేట్‌మెంట్‌లో తనపై తప్పుడు కేసులు బనాయించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్పీ, డీఐజీ స్థాయి పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆఫీసర్ల వేధింపుల గురించి చెప్పే అవకాశం ఉంది అని లాయర్ చెప్పారు.

ఈ కేసులో కీలక పాత్రధారి కుక్కల విద్యాసాగర్, ఇన్వెస్టిగేషన్ అధికారులు, పోలీస్ కస్టడీలో విచారించిన ఇద్దరు అధికారులు ఎవరనే విషయం గురించి స్పస్టమైన ఆధారాలు చెప్పలేకపోతున్నారు. ఓ ప్రాంతంలో బంధించి.. తరచు ఇద్దరు అధికారులు వచ్చి విచారించారు అని అన్నారు. ఈ వ్యక్తుల ఎవరనేది ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X