పెళ్లైన 3 నెలలకే మెగా కొత్త కోడలు షాక్.. వరుణ్ తేజ్‌కు ఉన్న ఆ సమస్యతో ఇబ్బందులు పడుతున్న లావణ్య!
టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ అండ్ లవబుల్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల గురించి అందరికీ తెలిసిందే. ఐదేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంట గతేడాది నవంబర్ ఒకటో తేదీన ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత తొలిసారి ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ తో లావణ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె.. తన భర్త వరుణ్ తేజ్ ఎదుర్కుంటున్న ఓ ఆరోగ్య సమస్య గురించి బయట పెట్టింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన తొలి ప్రాజెక్టే.. ఈ మిస్ పర్ ఫెక్ట్ వెబ్ సిరీస్. అయితే ఇందులో ఈమె హీరోయిన్ గా చేయగా.. అభిజీత్ హీరోగా కనిపించనున్నాడు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె తోటి నటులతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో లావణ్యకు అనేక ప్రశ్నలు ఎదురు అయ్యాయి. ముఖ్యంగా మీరు పెళ్లి తర్వాత త్వరగా సినిమాలు చేయడం సంతోషంగా ఉందంటే.. నా కెరియర్ ను నేను కొనసాగిస్తాను.. పెళ్లికి ముందు ఎలా చేశానో ఇప్పుడు కూడా అలాగే చేస్తానంటూ లావణ్య వివరించింది.

ఈ వెబ్ సిరీస్ లో మీరు చాలా పర్ఫెక్షనిస్ట్ గా ఉంటారు కదా.. మరి నిజ జీవితంలో ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. కొన్ని విషయాల్లో మాత్రమే నేను పర్ ఫెక్షనిస్ట్ గా ఉంటానని లావ్ వివరించింది. అన్ని విషయాల్లో అలా ఉంటే అది సమస్య అవుతుందని.. తనకు అలాంటి సమస్యలు ఏం లేవని స్పష్టం చేసింది. మీరు, మీ భర్తలో ఎవరు ఎక్కువ పర్ఫెక్షనిస్ట్ అని అడగ్గానే.. లావ్ నవ్వింది. వరుణ్ తేజ్ చాలా విషయాల్లో పర్ ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడని.. తాను అంతగా పట్టించుకోనని చెప్పుకొచ్చింది.
తనతో పోలిస్తే చాలా విషయాల్లో చాలా పర్ ఫెక్ట్ గా ఉండే తేజ్ ను చూస్తుంటే.. లిటిల్ బిట్ ఓసీడీ ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొంది. ఆమె చేసిన ఈ కామెంట్ తో అందరూ.. వరుణ్ తేజ్ కు నిజంగానే ఓసీడీ సమస్య ఉందని అంటున్నారు. అయితే నేరుగా చెప్పలేక లావణ్య ఇలా చెప్పి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. అన్నీ అర్థం చేసుకుని సపోర్ట్ చేసే భర్త ఉంటే ఎలాంటి సమస్య ఉండదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తన జీవితం చాలా సంతోషంగా సాగుతుందని.. మెగా ఫ్యామిలీ అంతా తనకు సపోర్ట్ గా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తనకు పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని.. పెద్దగా మార్పులు ఏమీ కనిపించట్లేదని స్పష్టం చేసింది. మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా త్వరలోనే మిస్ పర్ ఫెక్ట్ గా రాబోతున్న వెబ్ సిరీస్ ఏం రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











