Jr NTR పాటతో నందితా శ్వేత మూవీ.. ఒక్క పాత్రతోనే ప్రయోగాత్మక సినిమా!
సినిమాలకు కొన్నిసార్లు విభిన్నమైన పేర్లు పెడుతుంటారు. ఒకప్పుడు పద్ధతిగా మంచి అర్థం వచ్చే టైటిల్స్ పెడితే తర్వాతి కాలంలో డిఫరెంట్ అండ్ క్రేజీగా ఉండే పేర్లను ఎంపిక చేసేవారు. కొన్ని సందర్భాల్లో అయితే పలు సినిమాల్లో బాగా హిట్ అయిన పాటల నుంచి హుక్ లైన్ తీసుకుని టైటిల్స్ తో వచ్చేవారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు తాజాగా అలాంటి సినిమా ఒకటి రానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని పాపులర్ సాంగ్ హుక్ లైన్ ను మూవీ టైటిల్ గా తీసుకురానున్నారు.
ఎక్కడికి పోతావ్ చిన్నవాడా అనే నిఖిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నందితా శ్వేత. ఇందులో దెయ్యంగా తనదైన నటనతో ఎంతో ఆకట్టుకుంది. తర్వాత శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, కల్కి, కపటధారి, అక్షర, జెట్టి వంటి చిత్రాలు చేసింది. తమిళం, కన్నడలో అనేక చిత్రాల్లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ దబాంగ్ 3లో సోనాక్షి సిన్హాకు డబ్బింగ్ కూడా చెప్పింది.

ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పాటలోని హూక్ లైన్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది నందితా శ్వేత. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని 'రారా పెనిమిటి' (Raa Raa Penimiti) అనే సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. భర్త రాక కోసం ఓ భార్య పడే వేదనగా ఈ పాటను మలిచారు. ఇప్పుడు ఇదే టైటిల్ తో కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్ తో సినిమాను తీసుకొస్తున్నారు.
శ్రీ విజాయనంద్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మిస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'రారా పెనిమిటి'కి సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. చిత్రీకరణ పూర్తయిందని, ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉందని, త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని ఏప్రిల్ 9 ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ తెలిపారు.
దర్శకుడు కథ చెప్పినప్పుడు తాను తెగ భయపడిపోయినట్లు ముద్దుగుమ్మ నందితా శ్వేత తెలిపారు. సింగిల్ క్యారెక్టర్ అంటే చేయగలనా.. లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నానని నందితా అన్నారు. ఇలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, దర్శకుడు చెప్పింది చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో ఒక పాటకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని, ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు నందితా శ్వేత.


Click it and Unblock the Notifications











