Nayanthara: భర్త వలన 25 కోట్లు నష్టం.. ఓటీటీ సంస్థతో నయన్ కు కొత్త చిక్కులు?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో ఆమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. మహాబలిపురంలో ఎంతో గ్రాండ్ గా జరిగిన వారి వేడుకకు కొంతమంది స్టార్ సెలబ్రిటీలు కూడా వచ్చారు.

అయితే మొదటిసారి నయనతార తన భర్త సలహా కారణంగా దాదాపు 25 కోట్ల వరకు నష్టం చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక ఓటీటీ సంస్థతో అనుకున్న డీల్ సక్రమంగా జరగని కారణంగా ఇప్పుడు నయనతార చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. నోటీసులు కూడా అందినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి తరువాత కూడా..

పెళ్లి తరువాత కూడా..

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపునందుకున్న నయన్ తెలుగులో కూడా పెద్ద సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత 15 నెలలుగా ఒకే తరహా స్టార్ ఇమేజె తో కొనసాగుతున్న ఆమె సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పటిలానే సినిమాలు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది.

గ్రాండ్ గా వెడ్డింగ్

గ్రాండ్ గా వెడ్డింగ్

గత ఐదేళ్లుగా నయనతార యువ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాదిలోనే చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ మొదట అది అబద్ధం అని కూడా మధ్యలో మరికొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా వారిద్దరు విడిపోతున్నట్లుగా కూడా చాలా వార్తలు వచ్చాయి. కానీ నయనతార అనుకున్నట్లుగానే విగ్నేష్ ను హిందూ సంప్రదాయ ప్రకారం మహాబలిపురంలోనే ఒక రిస్టార్ట్ లో వివాహం చేసుకుంది.

హాజరైన సెలబ్రిటీలు

హాజరైన సెలబ్రిటీలు

జూన్ 9వ తేదీన జరిగిన వీరి పెళ్లి వేడుకకు కొంతమంది అగ్ర నటినటులు కూడా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు హీరోలు నిర్మాతలు అలాగే వీరి అతి దగ్గర బంధువులు కూడా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా విగ్నేష్ శివన్ పెళ్లిరోజు కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

విగ్నేష్ ఆలోచనతో

విగ్నేష్ ఆలోచనతో

అయితే ఈ పెళ్లి కారణంగా దాదాపు 25 కోట్లతో నెట్ ఫ్లిక్స్ తో ఒక డీల్ అయితే జరిగినట్లు తమిళ పరిశ్రమలు అనేక రకాల వార్తలు వచ్చాయి. అది కూడా విగ్నేష్ శివన్ ఆలోచన మేరకు ఓకే అయినట్లు టాక్. పెళ్లికి సంబంధించిన పూర్తి స్ట్రీమింగ్ హక్కులను నెట్లిక్ సంస్థ కొనుగోలు చేసినట్లుగా ఆ మధ్య కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్ పెళ్లి ఖర్చు

నెట్ ఫ్లిక్స్ పెళ్లి ఖర్చు

అందుకే ఆ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారానే జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కడ ఒక ఫోటో కూడా లీక్ కాకుండా సెలబ్రిటీలు కూడా ఫోటోలు తీయకుండా ఉండాలి అని ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినట్లు టాక్ వచ్చింది.

ఆ డబ్బు తిరిగివ్వాల్సిందే..?

ఆ డబ్బు తిరిగివ్వాల్సిందే..?

పెళ్లికి పూర్తిగా సొంత ఖర్చులను పెట్టుకున్నా నెట్ ఫ్లిక్స్ దాదాపు నయనతారకు 25 కోట్ల వరకు ఇచ్చినట్లుగా కూడా టాక్ వచ్చింది. అయితే విగ్నేష్ శివన్ పెళ్లి రోజే కొన్ని ఫోటోలను విడుదల చేయడంతో ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య కొంత చర్చలు అయితే సాగాయి. అనుమతి లేకుండా విగ్నేష్ ఫోటోలను ఎలా విడుదల చేస్తాడు అని సంస్థ కూడా డీల్ క్యాన్సిల్ చేసుకునేందుకు సిద్ధమయ్యిందట. ఇక తిరిగి 25 కోట్లు ఇవ్వాలి అని వారికి నోటీసులు కూడా పంపినట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ విషయంపై నయనతార టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X