twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆన్‌లైన్ ఫుడ్‌లో బొద్దింక.. స్విగ్గి యాప్‌కు, హోటల్‌కు చుక్కలు చూపించిన హీరోయిన్, భయటపడిన భారీ మోసం!

    |

    స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచం అన్నట్లుగా అయిపోయింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉంటే చాలు అన్ని ఆన్‌లైన్ ద్వారా కాళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఎన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక రావడంతో ప్రముఖ ఫుడ్ యాప్ కు అలాగే హోటల్ కు చుక్కలు చూపించింది. అనంతరం ఒక భారీ మోసం బయటకు వచ్చింది.

    నివేత పేతురాజ్ ఆగ్రహం

    నివేత పేతురాజ్ ఆగ్రహం

    ఆ హీరోయిన్ మరెవరో కాదు. మెంటల్ మదిలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజ్. అనంతరం చిత్రాలహారి, అల.. వైకుంఠపురములో, రెడ్ వంటి సినిమాల్లో ముక్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ ఆన్‌లైన్ ఫుడ్ సంస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

    ఫుడ్ లో ఒక బొద్దింక

    ఫుడ్ లో ఒక బొద్దింక


    ఇటీవల బాగా ఆకలిగా ఉన్న నివేత ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గిలో ఫ్రైడ్ రైస్ ను ఆర్డర్ చేసింది. చెన్నైలోని ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ఆమెకు ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె ఫుడ్ లో ఒక బొద్దింక రావడంతో షాక్ అవుతూ సోషల్ మీడియాలో సదరు సస్థలపై తీవ్ర స్థాయిలో విర్చుకుపడింది.

    నాణ్యతను పాటించడం లేదని

    నాణ్యతను పాటించడం లేదని

    నివేత పేతురాజ్ ఈ విధంగా వివరణ ఇచ్చింది. రెస్టారెంట్‌ని ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీలో.. ఈ మధ్య కాలంలో కొన్ని హోటల్స్ ను నాణ్యతను పాటించడం లేదని అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఆర్డర్ చేసిన భోజనంలో నాకు బొద్దింక వచ్చింది. అది చూసిన తరువాత హోటల్స్ వాళ్ళు ఏ మాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది.. అని పేర్కొంది.

     భయటపడిన మోసం

    భయటపడిన మోసం

    సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై తగిన చర్యలు తీసుకొని భారీ జరిమానా విధించాలని కూడా నివేతా పేతురాజ్ వివరణ ఇచ్చింది. అయితే ఆమె పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫుడ్ సెక్యూరిటీ అధికారులు రంగంలోకి దిగి హోటల్ లో సోదాలు నిర్వహించగా భారీ మోసం బయటపడింది. దాదాపు 10కేజీల నాణ్యత లేని మాంసాన్ని గుర్తించారు.

    దిగొచ్చిన స్విగ్గి యాప్

    దిగొచ్చిన స్విగ్గి యాప్


    దెబ్బకు హోటల్ ను అధికారులు అప్పటికప్పుడు మూయించేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్నందుకు పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక స్విగ్గి యాప్ కూడా దిగొచ్చింది. తప్పకుండా అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరొకసారి ఇలాంటి పొరపాటు ఉన్నట్లు నివేత పేతురాజ్ కు క్షమాపణ కోరింది.

    English summary
    The very hungry Nivetha ordered fried rice on the popular online food delivery app Swiggy. She had an unexpectedly bitter experience while ordering food from a popular restaurant in Chennai. She was shocked by the arrival of a cockroach in her food and went on a rampage on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X