Acharya Pre Release Event: ఆయన స్వాగ్ నాకు కూడా కొంచెం ఇస్తే బావుంటుంది.. పూజా హెగ్డే లవ్లీ స్పీచ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్న మరికొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నీలాంబరి అనే పాత్రలో నటించిన పూజా హెగ్డే కూడా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఆమె తనదైన శైలిలో మాట్లాడారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులందరికీ కూడా చాలా థాంక్స్. అక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గారికి థాంక్యూ సో మచ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమ అలాగే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను బాంబే కి వెళ్ళినప్పుడు అక్కడ సౌత్ ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మా డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా సాఫ్ట్.. దర్శకుడు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు.

Heroine pooja hegde speech in Acharya Pre Release Event

ఇక నన్ను నీలంబరి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే ఆయన స్వాగ్ అద్భుతం ఆయన స్టైల్ అలాగే ఎనర్జీ కూడా అద్భుతం. ఆయన ఆయన నుంచి నాకు కూడా కొంచెం స్వాగ్ ఇస్తే బాగుంటుంది. రామ్ చరణ్ గురించి చెప్పాలి అంటే ప్రతి సినిమాలో అతను చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సినిమా సెట్ లో మాత్రం చాలా కామ్గా ఉంటాడు. అతని సీక్రెట్ కూడా నాకు తర్వాత అర్థమైంది. సీన్ షాట్ స్టార్ట్ అయినప్పుడు అలాగే ముగిసినప్పుడు చాలా ఎనర్జీటీక్ గా ఉంటాడు.. అతనితో మరోసారి వర్క్ చేయాలని కూడా ఉంది.

ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డి గారు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ తీరు గారు పనితీరు కూడా అద్భుతంగా ఉంది. సినిమా లో ప్రత్యేకమైన సెట్ కూడా చాలా గొప్ప గా డిజైన్ చేశారు. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హీరోయిన్ పూజా హెగ్డే వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X