హీరోయిన్ పూర్ణ బ్యాక్ డోర్ ఎంట్రీ.. క్రేజీ ప్రాజెక్టులో ఛాలెంజింగ్‌గా
మలయాళ, తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న హీరోయిన్ పూర్ణ డ్యాన్స్ రియాలిటీ షోలో హోస్ట్‌గా మరింత పాపులారిటి తెచ్చుకొన్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో సినిమాలు ఓ వైపు చేస్తూనే మరోవైపు డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం బ్యాక్ డోర్ ఎంట్రీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బ్యాక్ డోర్ ఎంట్రీ చిత్రాన్ని యువ దర్శకుడు, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలు ఇటీవల లాంఛనంగా జరిగాయి.

ఈ సందర్బంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. బ్యాక్ డోర్ ఎంట్రీ పదం ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం అని అన్నారు. హీరోయిన్ పూర్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు.
ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ అధినేత బీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శరవేగంతో షూటింగ్ పూర్తి చేసేందుకు మా దర్శకుడు కర్రి బాలాజీ అన్ని సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు. చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.
సాంకేతిక నిపుణులు
పాటలు: జావళి
సంగీతం: ప్రణవ్,
ఆర్ట్: నాని,
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
కెమెరా: శ్రీకాంత్,
రచనా సహకారం: భూపతిరాజు రామకృష్ణ, రవి రోహిత్ జీ
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి,
రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ


Click it and Unblock the Notifications











