twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ మోసం చేశాడు.. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే అనుకున్నా కానీ! సీనియర్ హీరోయిన్ సీక్రెట్స్ రివీల్

    |

    బాల నటిగా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అందాల తార రాశి. వెండితెర అందాలకు చిరునామా అంటే రాశి అన్నట్లుగా క్రేజ్ కొట్టేసింది ఈ అచ్చ తెలుగు హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో తన సినీ కెరీర్ లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ఈ మేరకు డైరెక్టర్ తేజ గురించి ఆమె మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దామా..

    రాశి పెళ్లి సంగతులు.. ఆ ఇద్దరి పేర్లు చెప్పడంతో అంతా షాక్

    రాశి పెళ్లి సంగతులు.. ఆ ఇద్దరి పేర్లు చెప్పడంతో అంతా షాక్

    ఈ కార్యక్రమంలో భాగంగా తన పెళ్లి సంగతలు, ఇతర విషయాలు చెప్పి షాకిచ్చింది రాశి. తాను పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేష్‌ని గానీ, రాజీవ్ గాంధీని గానీ చేసుకుంటానని వాళ్ళ అమ్మానాన్నలతో చెప్పేదట రాశి. ఈ విషయం గురించి ప్రస్తావన రాగానే.. రాశి ఇచ్చిన రియాక్షన్ ఆశ్చర్యపరిచింది.

    అవును అన్నట్లుగానే.. హింట్

    అవును అన్నట్లుగానే.. హింట్

    అవును ఆ ఇద్దరినీ చేసుకుందామని ఉండేది అన్నట్లుగానే సిగ్గుపడుతూ బిగ్గరగా నవ్వింది రాశి. అంటే విక్టరీ వెంకటేష్ అన్నా, అలాగే రాజీవ్ గాంధీ అన్నా ఆమెకు అమితమైన అభిమానం అని తెలిసిపోతోంది. ఇది చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రేక్షకులు.

    ‘నిజం’ సినిమా సమయంలో తేజ..

    ‘నిజం’ సినిమా సమయంలో తేజ..

    ఇక ఇదిలా ఉంటే ‘నిజం' సినిమాలో పాత్ర గురించి మాట్లాడుతూ దర్శకుడు తేజ తనకు చెప్పిందొకటి, సినిమాలో చూపించిందొకటి అని రాశి చెప్పింది. గోపీచంద్, తను ప్రేమికులమని.. మధ్యలో విలన్ వస్తాడని ముందుగా తేజ చెప్పారని, కానీ తీరా సినిమా సెట్స్ పైకి వచ్చాక తన పాత్రను పూర్తిగా మార్చేసి నెగిటివ్‌గా చూపించారని రాశి పేర్కొనడం విశేషం.

    పవన్ కళ్యాణ్‌తో, రామ్ చరణ్‌తో

    పవన్ కళ్యాణ్‌తో, రామ్ చరణ్‌తో

    ఇదే కార్యక్రమంలో తనకు పవన్ కళ్యాణ్‌తో కలిసి గోకులంలో సీత సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో కూడా తెలిపింది రాశి. కొణిదెల సురేఖ కారణంగా ఆ పాత్ర తనకు దక్కిందని చెప్పిన ఆమె.. రామ్ చరణ్‌తో రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ వచ్చినా వదులుకున్నానని పేర్కొంది.

    ఈ మధ్య కాలంలో రాశి సినిమాలు.. ప్రస్తుత పరిస్థితి

    ఈ మధ్య కాలంలో రాశి సినిమాలు.. ప్రస్తుత పరిస్థితి

    ఒకప్పుడు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతూ సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశి.. గత కొంతకాలంగా తన సినిమాల ప్రవాహాన్ని తగ్గించేసింది. అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ సినిమాల పరంగా ప్రస్తుతం ఆమె ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు.

    English summary
    Senior heroine Raasi Open her voice in latest tv programe. Raasi revealed some interesting things about her life. She told that she planned to marry victory Venkatesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X