బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టిన రష్మీక.. నిజంగానే ఇది బంపర్ ఆఫర్
కన్నడ బ్యూటీ రష్మీక మందన్న మరోసారి మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే 2020లో గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేసిన నటులలో రష్మీక మందన్న టాప్ లో నిలిచింది. అదే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురిని బాగానే ఎట్రాక్ట్ చేసినట్లుంది. అందుకే అమ్మడి గ్లామర్ తో సినిమాలకు ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అమ్మడు ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఒక స్టార్ ర్యాపర్ చెయబోతున్న కాస్ట్లీ ప్రయివేట్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రష్మీక తెలుగులో ఇటీవల వరుస హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫెమాస్ ర్యాపర్ బాద్ షా చేయబోతున్న ఒక గ్లామరస్ సాంగ్ లో కనిపించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. బాద్ షా సాంగ్స్ కు యూట్యూబ్ లలో వంధల మిలియన్ల వ్యూవ్స్ వస్తుంటాయి.

పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా అతని సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రష్మీక మందన్న ఆ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చండిగర్ లో సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు కథనాలు పూట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రష్మీక బాలీవుడ్ సైడ్ నుంచి కూడా పలు ఆఫర్స్ అయితే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











