గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ.. ఫొటోలు వైరల్
ఓ సమయంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త అందాన్ని పరిచయం చేసిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి ఆమె అందాలు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె వివాహం జరిగిందని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తినే ఆమె పెళ్లాడిందని తెలిసింది. వివరాల్లోకి పోతే..

అమెరికా వెళ్లి.. అక్కడే ప్రేమ
టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా మెరిసిన రిచా గంగోపాధ్యాయ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిన ఈ భామ అక్కడే ఓ అమెరికన్‌ను ప్రేమించింది. ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలో అందరితో పంచుకుంది రిచా.

వాషింగ్టన్ ప్రేమ.. చివరకు అతన్నే
ఉన్నత విద్య కోసం వాషింగ్టన్ వెళ్లిన రిచా గంగోపాధ్యాయ అక్కడ తన తోటి విద్యార్థి అయిన జోకుతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి చివరకు అతన్నే పెళ్లాడింది. ఇటీవలే వీరి పెళ్లి జరిగిందని తెలిసింది.

కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో
క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రిచా గంగోపాధ్యాయ- జోకు పెళ్లి వేడుక జరిగిందని సమాచారం. ఘనంగా జరిగినప్పటికీ ఆమెకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రానాతో తెలుగు తెరకు పరిచయం
ఈ విషయాన్ని రిచా గంగోపాధ్యాయ మాత్రం అధికారికంగా ప్రకటించక పోవడం గమనార్హం. ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత రవితేజ సరసన ''మిరపకాయ్, సారొచ్చారు'' సినిమాలు, అలాగే ప్రభాస్ సరసన 'మిర్చి' సినిమాలో నటించి యువతకు మంచి కిక్కిచ్చింది.

ఆన్‌లైన్‌లో వెడ్డింగ్ విషెస్.. తమిళ స్టార్స్‌తో
తమిళ స్టార్స్ శింబు, ధనుష్‌లకు జోడీగానూ రిచా గంగోపాధ్యాయ నటించింది. ఓ బెంగాలీ సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించి అక్కడి వారికీ ట్రీట్ ఇచ్చింది. ఇక 2013 నుంచి రిచా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఏదేమైనా ఆన్‌లైన్‌లో ఆమెకు వెడ్డింగ్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











