అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్‌తో టెన్షన్‌‌లో ప్రియురాలు.. రకుల్ తమ్ముడితో సహజీవనం చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్‌ను భగ్నం చేయడంతో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు, సైబర్‌బాద్ పోలీస్ జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో అమన్ ప్రీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అయితే రకుల్ ప్రీత్ సోదరుడిగా తెలిసిన ఆయన గురించిన మరింత వివరాల్లోకి వెళితే..

రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన అమన్ ప్రీత్ సింగ్ హీరోగా పరిచయం అయ్యారు. త్రిశంకు, సెడిషన్, రామరాజ్య, నిన్నే పెళ్లాడుతా చిత్రాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలు ఏవీ కూడా ఆడకపోవడంతో ఆయన కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

Heroine Seerat Kapoor in Tension after lover Aman Preet Singh arrest in Drug Case in Hyderabad

ఇక యాక్టింగ్ మాత్రమే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ నిర్వహించే ఫిజికల్ ఫిట్‌నెస్ వ్యవహారాలను, పలు ప్రాంతాల్లో ఉన్న ఫిట్‌నెస్ సెంటర్లను చూసుకొనే వాడు. అలాగే పార్టీలు, పబ్‌లలో ఎక్కువగా కనిపించే వాడు. పేజ్ 3 ఈవెంట్స్ చురకుగా ఉండేవారని సినీ వర్గాలు చెబుతారు.

అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రకుల్, జాకీ, సీరత్, అమన్ కలిసి ఇటీవల విహారయాత్ర కూడా చేశారు. వారిద్దరూ నటించిన ఆవోనా మ్యూజిక్ అల్బమ్‌లో వారిద్దరి కెమిస్ట్రీ కేక పెట్టించింది. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Heroine Seerat Kapoor in Tension after lover Aman Preet Singh arrest in Drug Case in Hyderabad

అయితే అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత సీరత్ కపూర్ కూడా టెన్షన్‌లో పడిందనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సీరత్ కపూర్‌కు ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తున్నది. దాంతో సీరత్ కపూర్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొన్నట్టు తెలుస్తున్నది.

సీరత్ కపూర్ విషయానికి వస్తే.. తెలుగులో రన్ రాజా రన్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రాజు గారి గది, ఒక క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా? మారిచ్, భామాకలాపం, తాజాగా శర్వానంద్‌తో కలిసి మనమే చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X