హీరోయిన్‌నే నిర్మాతగా, రచయితగా పాన్ ఇండియా మూవీ.. దియా ఫేమ్ పృథ్వీ హీరోగా డియర్ ఉమ
కన్నడ చిత్రం దియాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో పృథ్వీ అంబర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న లవ్ అండ్ ఎంటర్‌టైనర్ డియర్ ఉమ చిత్రానికి హీరోయిన్ సుమయా రెడ్డి కథను అందించడమే కాకుండా నిర్మించడం విశేషంగా మారింది. ఈ సినిమా ప్రారంభ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య జరిగింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో టీమ్ మాట్లాడుతూ..
చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ.. మా టీమ్‌ను ఎంకరేజ్ చేయటానికి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్, కోన వెంకట్ థాంక్స్. డియర్ ఉమ కథను మా హీరోయిన్, నిర్మాత సుమయా రెడ్డి రాసి వినిపించారు. కథ వినగానే ఈ సినిమా బాధ్యతాయుతమైన చిత్రంగా అవుతుందని ఫీలయ్యా. రాజ్ తోట, రధన్, రామాంజనేయులు లాంటి ఉన్నత టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మా హీరోయినే నిర్మాతగా మారాలని ముందే అనుకునే ట్రావెల్ స్టార్ట్ చేశాం. ఆమె మల్టీ టాస్క్ పర్సనాలిటీ. అందరూ సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను. దీన్ని పాన్ ఇండియ మూవీగా తీస్తున్నాం. కథపై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం అని అన్నారు.

నిర్మాత, హీరోయిన్ సుమయా రెడ్డి మాట్లాడుతూ.. కథ నేను రాసినప్పటికీ నా టీమ్‌తో కలిసి డెవలప్ చేశాను. మేం కథపై నమ్మకంతో బాధ్యతగా తీసుకుని హీరోయిన్‌గా, నిర్మాతగా సినిమా చేస్తున్నాను. ప్రతి ఒక ఇంట్లో జరిగిన, జరుగుతున్న కథకు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని అన్నారు.

హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. నేను ముందుగా దియా అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు డియర్ ఉమ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డియర్ ఉమ కథ చాలా బావుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరితోపాటు మంచి మెసేజ్ ఉంటుంది అని అన్నారు.
నటీనటులు: పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి తదితరులు
బ్యానర్: సుమచిత్ర ఆర్ట్స్
కథ, నిర్మాత: సుమయా రెడ్డి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: సాయిరాజేష్ మహాదేవ్
కో ప్రొడ్యూసర్: కొండా జ్యోతి రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: నగేష్ యుజి
కెమెరా: రాజ్ తోట
సంగీతం: రధన్
ఎడిటర్: సత్య గిడుటూరి
ఆర్ట్ : ఏ రామాంజనేయులు
మేకప్: సతీష్ బాబు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నాసి పూడి చక్రవర్తి
కో డైరెక్టర్: ఎ.మదుసూదన్ రెడ్డి
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ గుండె
పీఆర్వో: వంశీ కాకా


Click it and Unblock the Notifications











