మొదటిసారి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన తమన్నా.. కరోనా తగ్గింది, కానీ..

ఇటీవల సౌత్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోవిడ్ భారిన పడిన విషయం అందరికి తెలిసిందే. తమన్నాకు కరోనా పాజిటివ్ అని తెలియడంటజో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి ముంబైలో తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న తమన్నా ఇటీవల షూటింగ్స్ కోసమని హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఇక ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఇక మొదటిసారి తమన్నా తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చింది.

Recommended Video

Tamannaah Tests COVID 19 Positive, Admitted in Hyderabad Hospital || Oneindia Telugu
 గత కొన్నిరోజులుగా దగ్గు, జ్వరం

గత కొన్నిరోజులుగా దగ్గు, జ్వరం

షూటింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తమన్నా గత కొన్ని రోజుల క్రితం కరోనావైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం ఆమె కోలుకోవడంతో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. దగ్గు జ్వరం ఉందని తెలియగానే టెస్టులు చేయించుకున్నట్లు చెబుతూ మొత్తానికి మీ అభిమానం ప్రేమ వల్ల కొలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు వివరణ ఇచ్చింది.

ఆరోగ్యం కుదుటపడడంతో

ఆరోగ్యం కుదుటపడడంతో

గత వారం క్రితం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దగ్గు తగ్గకపోవడంతో వెంటనే తమన్నా హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఇక ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటివద్దనే ఉండి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఇక 14రోజుల వరకు తమన్నా క్వారంటైన్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అంత సెట్టయ్యిందని అనుకున్న సమయానికి

అంత సెట్టయ్యిందని అనుకున్న సమయానికి

ఇటీవల కొన్ని వారాల క్రితమే ఆమె తల్లిదండ్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన తమన్నా తనకు మాత్రం నెగిటివ్ వచ్చిందని అప్పుడు వివరణ ఇచ్చింది. ఇక అంతా సెట్టయిందని షూటింగ్స్ మొదలుపెడదామని అనుకున్న సమయానికి ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షిణించింది. తల్లిదండ్రులు కోలుకున్న కొన్ని రోజులకే తమన్నా వైరస్ భారిన పడటం హాట్ టాపిక్ గా మారింది.

కోలుకున్న తరువాతే షూటింగ్స్

కోలుకున్న తరువాతే షూటింగ్స్

ఇక తెలుగు ఆహా యాప్ లో తమన్నా ఒక టాక్ షో చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన షూటింగ్ కోసం రేడి అవుతుండగా అనుకోకుండా ఈ వైరస్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చే సమయంలోనే తమన్నాకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఫైనల్ గా కోలుకోవడంతో పూర్తిగా హెల్త్ సెట్టయిన తరువాత మళ్ళీ యధావిధిగా షూటింగ్స్ లో పాల్గొంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X