త్రిష కూడా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తోంది.. రెమ్యునరేషన్ తక్కువే..

సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిష అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. గత 20 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా అదే గ్లామర్ తో కొనసాగుతోంది. ఓ విదంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె అందం కూడా పెరుగుతోంది అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇక మొదటిసారి త్రిష డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందట.

ప్రస్తుతం కుర్ర హీరోయిన్స్ హవా పెరగడంతో సీనియర్ హీరోయిన్స్ కి అవకశాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ త్రిష తనదైన శైలిలో అవకాశాలు అందుకుంటూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక త్వరలో ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 6 సినిమాలతో బిజీగా ఉన్న త్రిష మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటోంది.

Heroine Trisha krishnan upcoming web series

ఇక ఓటీటీ ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయట. అందులో ఒక వెబ్ సిరిస్ కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సిరీస్ కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. ప్రస్తుతం త్రిష రెమ్యునరేషన్ ని పట్టించుకోకుండా సినిమాలను చేస్తోందట. హీరోయిన్ గా కెరీర్ ఎండ్ అవుతున్న సమయంలో వీలైనంత వరకు మంచి సినిమాలను చేయాలని త్రిష ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X