RCB బెంగళూరు ఓటమిపై యువ హీరోయిన్ షాకింగ్ పోస్ట్.. గుండె ముక్కలైంది అంటూ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సంచలనలతో కొనసాగుతున్నది. ఐపీఎల్ తాజా సీజన్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. సన్ రైజర్స్ జట్టు అత్యధిక స్కోర్లను నమోదు చేస్తూ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకొంటున్నది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుసగా పరాజయం పొందుతూ అభిమానులను కుంగదీస్తున్నది. అయితే ఆర్సీబీ జట్టు ఓటమి తట్టుకోలేక యంగ్ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో చెత్త ఆటతీరును ప్రదర్శించడంలో బెంగళూరు టీమ్ టాప్‌లో ఉంటడం అభిమానులను వేదనకు గురిచేస్తున్నది. బ్యాటింగ్‌లో రాణిస్తున్నా బౌలింగ్‌లో దారుణంగా విఫలం కావడం వారి ఓటమికి కారణమనే వాదన బలంగా వినిపిస్తున్నది.

Heroine Varsha Bollamma Shocking reaction in Twitter over RCB defeat in IPL

ప్రస్తుతం సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడితే.. ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై.. ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో మైనస్‌లో ఉంది. అయితే చూడటానికి పేపర్ మీద బలంగా కనిపించే జట్టు మైదానంలో దారుణంగా బొక్కా బోర్లా పడుతున్నది. వారి ఆట తీరు అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నది.

ఇక ఏప్రిల్ 15వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓటమి పాలైంది. హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 288 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలుకావడం జీర్ణీంచుకోలేని విషయంగా మారింది.

Heroine Varsha Bollamma Shocking reaction in Twitter over RCB defeat in IPL

అయితే బెంగళూరు జట్టు ఓటమి పాలైన తర్వాత సినీ నటి వర్ష బొల్లమ్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి.. నా హృదయం ముక్కలైంది అనే విధంగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వర్ష బొల్లమ్మ తెలుగు, కన్నడ సినిమా రంగంలో వర్థమాన తారగా ఆకట్టుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X