twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముమైత్ ఖాన్ రీఎంట్రీ.. ఆకట్టుకొంటున్న హెజా టీజర్..

    |

    మిస్టర్ 7 , యాక్షన్ 3D, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశీ దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో‌గా చేసిన చిత్రం "హేజా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత పేర్కొన్నారు. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉండగా చిత్ర బృందం శుక్రవారం (జూలై 5న) టీజర్‌ను రిలీజ్ చేయగా, మంచి స్పందన లభిస్తున్నది.

    చాల రోజుల తర్వాత సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని విఎన్‌వి క్రియేషన్స్ పతాకంపై కేవీఎస్ఎన్ మూర్తి నిర్మించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీగా వ్యవహరించారు.

     HEZA teaser released: Mumaith Khan re entry in tollywood

    ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ... ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు.. ఈ సినిమా తో ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు..ఇప్పటివరకు వచ్చిన సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా ఉంది.. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు..

    నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతుంది.. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు.. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం అని అన్నారు..

    నటీనటులు : మున్నా కాశి , ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ తదితరులు...
    సాంకేతిక నిపుణులు :
    ప్రొడ్యూసర్:- కెవిఎస్ఎన్ మూర్తి
    బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్
    స్టోరీ - స్క్రీన్ ప్లే -మ్యూజిక్ -డైలాగ్స్ -డైరెక్షన్ - మున్నా కాశీ
    మ్యూజిక్ : మున్నా కాశీ అలియాస్ కె.వి.ఎస్.ఎన్ మూర్తి,
    సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
    ఎడిటర్ : గారి బి హెచ్

    English summary
    Heza is new horror film hitting tollywood. Mister 7 fame music director Munna Kasi turns as director and hero with this movie. Very soon this will be hit the theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X