Hi Nanna Twitter Review హాయ్ నాన్న ఎమోషనల్ డ్రామా. నాని ఫెర్ఫార్మెన్స్ అదుర్స్
వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం హాయ్ నాన్న. నాని, మృణాల్ థాకూర్, కియారా ఖన్నా, జయరాం, నాజర్, అంగద్ బేడీ నటించిన ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాను ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమా గురించి నెటిజన్స్ వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

హాయ్ నాన్న సినిమాలో పలు సన్నివేశాల్లో విరాజ్ పాత్రలో నాని హార్ట్‌ను టచ్ చేస్తాడు. యష్ణ, వర్ష పాత్రల్లో మృణాల్ ఒదిగిపోయింది. బేబీ కియారా నటన చూస్తే లవ్‌లో పడిపోతాం. దర్శకుడు శౌర్య రాసిన కథ, టేకింగ్ బాగుంది. హేషమ్ మ్యూజిక్ గుర్తుండిపోతుంది. భావోద్వేగంతో ఉండే ప్రతీ తండ్రి విరాజ్ పాత్రకు కనెక్ట్ అవుతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హాయ్ నాన్న సినిమా చూశాను. నేను చాలా ఇష్టపడ్డాను. ఎమోషన్స్‌ను బాగా హ్యాండిల్ చేశారు. నాని యాక్టింగ్ గుడ్, చిన్నపాప క్యూట్‌గా ఉంది. ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమా హాయ్ నాన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. థియేటర్‌లోనే ఈ సినిమాను చూడండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
హాయ్ నాన్న సినిమా ఫర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌తో రూపొందించారు. నాని అన్న ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు. మృణాల్ థాకూర్ స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంది. ఆమె పోషించిన పాత్ర ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. సీత లాంటి పాత్రలను కంటిన్యూ చేసినట్టు అనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హాయ్ నాన్న ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ ఫీల్ గుడ్, నాని, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది. నాని నుంచి మరో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. టీమ్‌కు కంగ్రాటులేషన్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హాయ్ నాన్న సినిమా ఎమోషనల్ డ్రామా. నాని ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. సినిమాకు గుండె మాదిరిగా మారాడు. యష్ణ పాత్రకు మృణాల్ కచ్చితంగా సరిపోయింది. బేబీ కియారా యాక్టింగ్ ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే అని నెటిజన్ కామెంట్ చేశాడు.
హాయ్ నాన్న సినిమా హృదయాన్ని కదిలించే బ్యూటిఫుల్ సినిమా. నాని కెరీర్‌లో మైలురాయిగా నిలిచే సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా చూసినంత సేపు కంటి తడితో ఏడుస్తూనే ఉన్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











