Hidimbha Trailer Review హిడింబ ట్రైలర్ అదుర్స్.. బిగ్గెస్ట్ హిట్ ఖాయం.. సాయిధరమ్ తేజ్
యంగ్ హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
హిడింబ చిత్రం 1908 సంవత్సరంలో జరిగిన పిరియాడిక్ ఎలిమెంట్‌తో రూపొందిందనే విషయం స్పష్టమైంది. బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్లే సన్నివేశాలతో ట్రైలర్ ఎమోషనల్‌గా కనిపించింది.

సముద్రం ఒడ్డును పుర్రె కనిపించడం.. ఆ తర్వాత హైదరాబాద్‌లో 16 మంది మిస్సింగ్ అవ్వడం సంచలనంగా మారుతుంది. మిస్పింగ్ కేసుల్లో ఎరుపు రంగు మిస్టీరియస్‌గా మారడం, నాలుగు కొమ్ముల జంతువు ముఖం పోలిన మాస్క్ లాంటి అంశాలు సినిమాను చూద్దామా? అనే క్యూరియాసిటిని పెంచాయి. హిండింబ మూవీలో నందితాశ్వేత, అశ్విన్ బాబు పోలీసుల దర్యాప్తు ఆసక్తిని రేపింది.
అనీల్ కన్నెగంటి కొత్తవాడైనప్పటికీ.. కథలోని అంశాలను ఇంటెన్స్‌తో తెరకెక్కించిన విధానం, అతని ప్రతిభకు ట్రైలర్ మచ్చు తునకలా కనిపించింది. ట్రైలర్‌లో సన్నివేశాలు కొత్తగా కనిపించాయి. దీంతో కంటెంట్ ప్రధానంగా సాగే కథగా, యాక్షన్‌తో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రంగా ట్రైలర్ ఫీల్‌ను కలిగించింది. బీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి, వికాస్ బాడిసా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను కల్పించాయి.
హిడింబ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. హిడింబ ట్రైలర్ అదిరిపోయింది. మూవీ యూనిట్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. అశ్విన్ సినిమా ట్రైలర్ లాంచ్‌కు రావడం ఆనందంగా వుంది. క్రికెట్‌తో మా పరిచయం ఏర్పడింది. ఈ సినిమా పెద్ద విజయం కావాలి అని కోరారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. హిడింబ ట్రైలర్ నచ్చడం అనందంగా ఉంది. నా స్నేహితుడు తేజు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విరూపాక్ష మూవీతో 100 క్లబ్ లో తేజు చేరడం నాకు గర్వంగా వుంది. పవన్ కళ్యాణ్ అంటే మా ఇద్దరికీ ఫేవరేట్. ఇప్పుడు ఆయనతో బ్రో సినిమా చేయడం ఆనందంగా ఉంది. హిడింబ నా కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చేశారు. దర్శకుడు అనిల్ సినిమా అద్భుతంగా తీశారు అని అన్నారు.
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ.. హిడింబ ట్రైలర్ లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్‌కు కృతజ్ఞతలు. ఒరిజినల్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా హిడింబ. గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. అనిల్ సుంకర సమర్పించడం ఆనందంగా ఉంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











