VYOOHAM: రాంగోపాల్ వర్మకు దిమ్మతిరిగే షాక్.. అసలైందే రద్దు చేసిన హైకోర్టు

కెరీర్ ఆరంభంలోనే ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తెరకెక్కించి.. దేశ వ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును సొంతం చేసుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆ తర్వాత కూడా ఎన్నో రకాల జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలు తెరకెక్కించాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆర్జీవీ వివాదాస్పదమైన పొలిటికల్ సినిమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాడు.

కొంత కాలం ఏపీ పాలిటిక్స్‌ను టచ్ చేసే సినిమాలు చేస్తోన్న రాంగోపాల్ వర్మ.. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్శీ మూవీలు చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వ్యూహం' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్టోరీతో ఇది తీశాడు.

High Court Cancels Ram Gopal Varma VYOOHAM Movie Censor Certificate

'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో 'వ్యూహం' చిత్రాన్ని తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ గతంలోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే దీన్ని వివాదాస్పద కంటెంట్‌తో తెరకెక్కించాడు. ఈ మూవీని డిసెంబర్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించి.. ప్రచార చిత్రాలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చాడు. అంతలోనే ఓ షాక్ తగిలింది.

'వ్యూహం' సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పును ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.

'వ్యూహం' సినిమా పిటీషన్‌పై తాజాగా హైకోర్టు ఊహించని తీర్పును ఇచ్చింది. ఇందులో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని మరోసారి రివ్యూ చేసి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫలితంగా రాంగోపాల్ వర్మ సినిమా విడుదల మరోసారి ఆగిపోయింది.

High Court Cancels Ram Gopal Varma VYOOHAM Movie Censor Certificate

ఇదిలా ఉండగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X