twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైకోర్టుకు చేరిన ఏపీ టిక్కెట్ల వ్యవహారం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. ఆ ప్లాన్లో ప్రభుత్వం?

    |

    టాలీవుడ్ ను వేధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల వ్యవహారం ఉంది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో మొదలైన ఈ వ్యవహారం ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 35 పై వేసిన పిటిషన్ మీద శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ నేపధ్యంలోనే జీవో 35 పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. తెలుగు నిర్మాత నట్టి కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను కొందరు యాజమాన్యాలు అమలు చేయడం లేదని నట్టికుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    అధిక రేట్లకు బ్లాక్‌ లో టికెట్లు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ అంశం మీద దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే ఈ వ్యవహారంలో అన్యాయం, దోపిడీ పై చర్యలు తీసుకోవాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 35 రూపాయల టిక్కెట్లు కొంతమంది థియేటర్ యజమానులు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని, ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎం ఆర్ ఓ., ఆర్డీవో స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకు వెళ్లానని తాజాగా నట్టి కుమార్ వెల్లడించారు. ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతుందని ఆయన పేర్కొన్నారు.

    High Court crucial orders on tickets rates G.O. to Andhra pradesh government

    ఈ అంశం మీద తాను కోర్టుకు వెళ్లడంతో కోర్టులో ఇరు పక్షాల వాదనలు జరిగాయని దీంతో శనివారం హై కోర్టు జీవో 35 పై పూర్తి వివరాలు వెల్లడిస్తూ కౌంటర్ అఫిడవిట్ ను నాలుగు వారాల్లోగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని నట్టి కుమార్ మీడియాకు తెలిపారు. ఇక మరో పక్క ఏపీ సీఎంకు సైతం నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. జీవో 35 చిన్న సినిమాలకు వరంగా ఉందన్న ఆయన మీరు ఎంతో మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన ఆ జీవోను కొంత మంది మంది థియేటర్ యాజమాన్యాలు అమలు పరచకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ... ప్రేక్షకుల డబ్బులు దోచుకుంటున్నారని... కొందరు స్థానిక అధికారులు కూడా దీనికి సహకరిస్తున్న కారణంగా ఈ అంశం మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రచారం జరుగుతున్న దాని మేరకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, రీమేక్ ఫిల్మ్‌లు మరియు ఇతర భాషా చిత్రాల వంటి వివిధ కేటగిరీల కోసం వేర్వేరు టికెట్ ధరలు నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ మేరకు చిరంజీవి బృందంతో భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Producer Natti Kumar approached the High Court demanding the strict implementation of the tickets rates G.O. the industry is demanding to be changed. High Court asked the government to file an affidavit about the implementation of Ticket Rates G.O
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X