రోబో సినిమా కాపీనా.. శంకర్‌కు జరిమానా విధించిన కోర్టు!
శంకర్ తెరకెక్కించినా రోబో చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్ స్టార్ రజనీ మేనియాకు శంకర్ దర్శత్వం తోడవడంతో రోబో చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.
శంకర్ తెరకెక్కించిన రోబో చిత్ర కథ తనదంటూ ప్రముఖ రచయిత ఆరూర్ తమిళ నాడన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం హాజరు కావాలని న్యాయస్థానం శంకర్ ని పలు మార్లు ఆదేశించింది. అయినా కూడా శంకర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో శంకర్ కు సోమవారం 10 వేలు జరిమానా విధించింది.

శంకర్ ప్రస్తుతం రోబోకు సీక్వెల్ గా 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు శంకర్ భారతీయుడు 2 ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











