రాంగోపాల్ వర్మకు హైకోర్టు షాక్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ వాయిదా

రామ్ గోపాల్ వర్మ చిత్రానికి అడుగడునా అవాంతరాలుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని ఎదురైనా తన చిత్రాన్ని మాత్రం అనుకున్న సమయానికే విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. వర్మ తన కొత్త చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లుతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వర్మ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాపైనా కేసులు నమోదయ్యాయి.

వారంలోగా సినిమా చూడాలి..

వారంలోగా సినిమా చూడాలి..

ఆర్జీవి చిత్రాలంటే.. అవన్నీ కామన్ అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వర్మ చిత్రానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. చిత్రాన్ని వాయిదా వేయాలని, సెన్సార్ అయ్యాకే ప్రదర్శించాలని ఆదేశించింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా చిత్రం ఉందని, అన్నింటినీ సెన్సార్ సభ్యులు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. వారంలోగా సినిమాను వీక్షించి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని తెలిపింది.

టైటిల్‌పై కేసులు..

టైటిల్‌పై కేసులు..

సినిమా విడుదలకు ఒక్క రోజే గడువున్నా.. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాకపోవడంతో హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. సినిమా టైటిల్‌పై కొందరు కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ఒక్క రోజు ముందు ఈవిధమైన తీర్పునివ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

Recommended Video

RGV Press Meet About Kamma Rajyam Lo Kadapa Reddlu Movie - Part 1
టైటిల్ మార్చేందుకు అంగీకరించిన వర్మ..

టైటిల్ మార్చేందుకు అంగీకరించిన వర్మ..

ఒకవేళ సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపితే.. తన చిత్ర టైటిల్‌ను మార్చుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని పెడతానని ప్రకటించాడు. సినిమా విడుదలను వాయిదా వేయాలని ఎవ్వరూ ఊహించని రీతిలో హైకోర్ట్ షాక్ ఇచ్చింది.

ఇప్పటికే అంతా సిద్దం..

ఇప్పటికే అంతా సిద్దం..

రేపు (నవంబర్ 29) ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని పనులను పూర్తి చేసేసింది చిత్రయూనిట్. అయితే హైకోర్ట్ ఇచ్చిన ఈ తీర్పుతో యూనిట్ మొత్తం షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ చిక్కు వచ్చిపడ్డట్టైంది. వారంలోగా సినిమాను చూసి.. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X