For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్ఆర్ఆర్: ఈ రేంజ్‌లో షూట్ చేస్తున్నారంటే మాములుగా ఉంటుందా? చెర్రీ,ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద పండగే

|

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం చేసిన ఖర్చు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నిర్మాత దానయ్య ఏ మాత్రం వెనకాడకుండా ఒక ఫైట్ సీన్ కోసమే ఏకంగా 45 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ రేంజ్‌లో షూట్ చేస్తున్నారంటే ఈ ఫైట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల పోరాట సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఇందులో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోందట. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దాదాపు 2 వేల మందితో కలిసి ఫైట్‌ చేయబోతున్నారట. ఈ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం కొన్ని వందల మంది యూనిట్‌ సభ్యులు ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. వందల మంది విదేశీయులతో, భారీ సెట్‌లో రెండు నెలల పాటు ఈ ఫైట్ షూట్‌ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజమౌళి టేకింగ్ లో భారీ ఫైట్ సీన్ అందునా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఇద్దరూ పార్టిసిపేట్ చేయడం అంటే ఈ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం సాధ్యపడదు. కాకపోతే ఈ భారీ ఫైట్ సీన్ చెర్రీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అని మాత్రం చెప్పగలం.

High Range Fight Seen Will Appear In Rajamoulis RRR

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, పైగా ఎన్టీఆర్- రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఆలియా భట్ ఓ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ కోసం వేటలో ఉంది జక్కన్న టీమ్. వచ్చే ఏడాది జులై 31 న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more about: rrr ram charan rajamouli
English summary
Rajamouli Now directed RRR movie. It will going to realese as fourth movie of ntr, Rajamouli successful combo. Now this movie shooting in hyderabad with any publicity. As par latest talk high range fight seen will appear in RRR movie
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more