Acharya మూవీలో హైలెట్ సీన్స్.. రాంచరణ్ ఎపిసోడ్‌లో పవర్‌ఫుల్ ట్విస్టు అదే..
ఆచార్య చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాతోపాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ రిపోర్ట్ బయటకు వస్తున్నది. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లు, కీలక అంశాలు, చిరంజీవి, రాంచరణ్ పాత్రల గురించిన కీలక అంశాలు మీ కోసం..
Recommended Video


మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో
ధర్మస్థలి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో ఆచార్య మొదలవుతుంది. ఆ తర్వాత సోనుసూద్ ఎంట్రీతో చిరంజీవి ఇంట్రో సీన్‌కు రంగం సిద్ధం అవుతుంది. స్టైలిష్‌గా, సింపుల్‌గా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. ధర్మస్థలి ప్రాంతంలో లాహే లాహే పాటతో అసలు కిక్కు ప్రారంభమవుతుంది.

మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, ఫైట్స్
ధర్మస్థలిలో చిరంజీవి ఎంట్రీ తర్వాత సినిమా ఎమోషనల్‌గా మారిపోతుంది. చిరంజీవి మేనరిజంతో ఫస్ట్ ఫైట్ క్రేజీగా ఉంటుంది. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, స్టయిల్‌గా చేసిన ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తాయి. చిరంజీవి ఫైట్ తర్వాత పూజా హెగ్డే నీలాంబరి క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత కథలో భాగంగా సినిమాలోని పాత్రలు తెరపైకి వస్తాయి.

ఇంటర్వెల్‌కు ముందు సిద్దా పాత్రతో
ఆచార్య ఫస్టాఫ్ ముగింపుకు కొద్ది నిమిషాల ముందు రాంచరణ్ పాత్ర సిద్దా ఎంట్రీ ఇస్తుంది. రాంచరణ్ ఫైట్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. రెజీనా కసండ్రాతో సానా కష్టం వచ్చింది అనే స్పెషల్ సాంగ్ మొదలవుతుంది. ఈ పాటలో రెజీనా గ్లామర్‌గా కనిపించింది. చిరంజీవి స్టెప్పులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.

చిరంజీవి, సోనుసూద్ మధ్య
ఇంటర్వెల్‌కు ముందు చిరంజీవి, సోనుసూద్ మధ్య భీభత్సమైన ఫైట్ సీన్ ఉంటుంది. తెరపైన ఇద్దరు తలపడటం చాలా ఇంటెన్స్‌గా చిత్రీకరించారనిపిస్తుంది. ఈ ఫైట్ తర్వాత రాంచరణ్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రారంభంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సిద్దా క్యారెక్టర్ ఎంట్రీతో సెకండాఫ్ మొదలవుతుంది.

రాంచరణ్ ఎంట్రీ తర్వాత
రాంచరణ్ ఎంట్రీ తర్వాత మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. చిరంజీవి, రాంచరణ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఎమోషనల్‌గా కనిపిస్తాయి. కొన్ని సీన్ల తర్వాత చిరంజీవి, రాంచరణ్ మధ్య భలే భలే బంజారా పాట ఫ్యాన్స్ పిచ్చెక్కించేలా ఉంటుంది. ఇలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే క్రమంలో ఓ ట్విస్టు సినిమాను మరింత ఎమోషనల్‌గా మారుస్తుంది. ఈ ట్విస్టు భావోద్వేగానికి గురిచేసే విధంగా, కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది.

అదరగొట్టే విధంగా క్లైమాక్స్
ఆచార్య క్లైమాక్స్ హై ఓల్టేజ్‌గా, పవర్‌ఫుల్‌గా మొదలవుతుంది. చిరంజీవి తనదైన మార్క్ ఫెర్ఫార్మెన్స్‌తో కేక పుట్టిస్తారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, చిరంజీవి యాటిట్యూడ్, స్క్రీన్ ప్రజెన్స్ అద్బుతంగా ఉంటుంది. ఓ బలమైన సీన్‌తో ఆచార్య సినిమాకు తెర పడుతుంది.


Click it and Unblock the Notifications











