‘ఆచార్య’ షూటింగ్‌పై తాజా సమాచారం: ఇంకా అన్ని రోజులైతే పూర్తవుతుందట
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాను మొదలు పెట్టి చాలా కాలమే అవుతోన్నా.. పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు కరోనా వల్ల వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ గురించి ఓ న్యూస్ లీకైంది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీకి మరో 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అదంతా హైదరాబాద్ నగర శివారులో వేసిన టెంపుల్ టౌన్ సెట్‌లోనే జరగనుందని తెలుస్తోంది. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయి ఉండకపోతే.. ఇప్పటికే అది కంప్లీట్ అయ్యేదని చెబుతున్నారు. ఇక, ఈ షూట్‌లో చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. అలాగే, చరణ్ పైనా కొన్ని సీన్స్ తీయాల్సి ఉందని తెలుస్తోంది. ఇందులో ఓ యాక్షన్ సీన్ కూడా బ్యాలెన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పదిహేను రోజులు షూటింగ్ జరిగితే 'ఆచార్య' పూర్తవుతుందన్న మాట.

దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో రాబోతున్న 'ఆచార్య'లో రామ్ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటకు విశేషమైన స్పందన వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.


Click it and Unblock the Notifications











