ఒకే ప్రేమ్‌లో ప్రధాని మోదీ, చిరంజీవి, పవన్ కల్యాణ్.. అద్బుత దృశ్యం మీరు చూశారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేడుకలో ఎన్నో అనుభూతులు, భావోద్వేగాలు కనిపించాయి. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్, చిరంజీవి, అమిత్ షా, నడ్డా, రాంచరణ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేదిపై, ప్రాంగణంలో కొన్ని హై మూమెంట్స్ విషయానికి వెళ్తే..

ప్రమాణ స్వీకారానికి ముందు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గౌరవంగా తోడ్కోని వచ్చారు. వేదిక మీద మోదీ కూర్చోగానే ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. మొదట చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నారా లోకేష్ తదితరులు మొత్తం 24 మంది ప్రమాణం చేశారు.

Highlights of Andhra Pradesh Swearing Ceremony Narendra Modi showers love on Chiranjeevi and Pawan Kalyan

ప్రమాణ స్వీకారానికి ముందు కొన్ని క్షణాల ముందు మెగా పవర్ స్టార్ రాంచరణ్ వేదిక వద్దకు వచ్చారు. ఆయన రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. అనంతరం లోకేష్ సతీమణి పక్కనే రాంచరణ్ కూర్చొని ముచ్చటించడం కనిపించింది.

పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన సతీమణి అన్నా లెజోనోవా వీడియో తీస్తూ ఆనందంలో మునిగిపోయారు. ఇక చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ ప్రమాణం చేస్తున్నప్పుడు తదేకం తన తమ్ముడి వైపు చూస్తూ ఉండిపోయారు.

ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగానే.. మోదీ వద్దకు పవన్ వెళ్లి తన అన్న చిరంజీవి గురించి చెప్పారు. దాంతో వెంటనే పవన్ చేతిని పట్టుకొని వెళ్లి చిరంజీవిని మోదీ విష్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేశారు. దాంతో ప్రజలు చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. ఈ దృశ్యం అత్యంత అపురూపంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X