అల్లరి నరేష్ మూవీపై నెటిజన్ల ఆగ్రహం.. మా మతమంటే అంత చులకనా? అంటూ ట్రోలింగ్!
తెలుగు సినిమా దగ్గర కామెడీ జానర్ సంబంధించి కొందరు హీరోలు మాత్రమే మంచి పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అప్పట్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి నటులు కామెడీ జానర్ లో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించగా తదుపరి జెనరేషన్ లో 'అల్లరి' సినిమాతో పరిచయం అయ్యిన నరేష్ తెలుగులో ఓ రేంజ్ వినోదాన్ని అందించాడు.
అలా కెరీర్ స్టార్టింగ్ నుంచే ఎన్నో కామెడి సినిమాలు చేసి మంచి ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ గా మారిన అల్లరి నరేష్ అలా వాటితోనే కొన్ని ప్రయోగాత్మక సినిమాలు సీరియస్ డ్రామాస్ గా చేసేవాడు కానీ ఇవి పెద్దగా వర్కౌట్ అయ్యేవి కాదు. కామెడీ జానర్ నుంచి సడెన్ గా సీరియస్ జానర్ సినిమాల్లో నరేష్ ని ఆడియెన్స్ తీసుకోలేకపోయారు.

కానీ నరేష్ నటుడుగా ఒక్క కామెడీ మాత్రమే కాదు మిగతా పెర్ఫామెన్స్ లు కూడా చేయగలను అని "నాంది" తో అదరగొట్టాడు. కాగా అక్కడ నుంచి సీరియస్ సినిమాలు చేస్తూ మధ్యలో కొన్ని కామెడీ కూడా చేసాడు. అయితే ఈసారి కామెడీ సినిమాలు అంతగా వర్కౌట్ కావట్లేదు. రీసెంట్ గానే "ఆ ఒక్కటీ అడక్కు" సినిమాతో వచ్చాడు కానీ ఇది జస్ట్ యావరేజ్ గానే నిలిచింది.
ఇక దీనితో వెంటన్ ఒక షాకింగ్ మేకోవర్ లో అనౌన్స్ చేసిన సినిమానే "బచ్చల మల్లి". దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హను మాన్ నటి అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇప్పుడు వరకు ఎలాంటి కాంట్రవర్సీ లలో ఇరుక్కోని అల్లరి నరేష్ ఈ సినిమాతో ఇరుక్కున్నాడు. నిన్న తన బర్త్ డే కానుకగా వచ్చిన గ్లింప్స్ లో స్టార్టింగ్ బిట్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసింది అని ఆగ్రహానికి లోనవుతున్నారు.
ఇందులో ఒక మైక్ సెట్ లో "దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు".. అంటూ ఒక శ్లోకం భగవద్గీత నుంచి వస్తుంది. అయితే ఇది వస్తున్న సమయంలో నరేష్ పాత్ర ఆ మైక్ ని పీకి లాగి నేలకేసి కొడతాడు. దీనితో ఈ సన్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. ఈ సీన్ ని సినిమాలో తొలగించాలి అని సోషల్ మీడియాలో అల్లరి నరేష్ న టాగ్ చేసి మరీ డిమాండ్ చేస్తున్నారు.
హిందూ శ్లోకాలు, హిందూ మతం అన్నా ఇంత చిన్న చూపా? అదే మైక్ ప్లేస్ లో ఇస్లాం కానీ క్రైస్తవం కానీ ఎందుకు చూపించలేదు. అలా చూపించే దమ్ముందా? అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మొదటిసారి అల్లరి నరేష్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో మేకర్స్ దీనిపై ఏమన్నా స్పందిస్తారో లేదో అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











