కార్తికేయ లేటెస్ట్ రిలీజ్ ‘హిప్పి’ టాక్ ఎలా ఉందంటే...?
'ఆర్ఎక్స్ 100' సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ తాజాగా 'హిప్పి' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. ఇందులో కార్తికేయ సరసన దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నటుడు జెడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో 'హిప్పి'పై మంచి అననాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే సినిమాను భారీగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా మూవీ టాక్ ఎలా ఉందనే రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి.
ఇందులో శివ అనే రోల్ చేసిన కార్తికేయ... ప్రేమకారణంగా మనశ్శాంతి కోల్పోయిన యువకుడిగా నటించాడు. అతడి బాస్ పాత్రను జేడీ పోషించారు. క్రేజీనెస్ అనేది హ్యాపీనెస్‌కు కీ అనే విషయాన్ని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో వెన్నెల కిషోర్ హార్లే డేవిడ్‌సన్‌గా ఫ్రేక్షకులను నవ్వించినట్లు తెలుస్తోంది.

మొదటి భాగం యువతకు నచ్చే వినోదాత్మక అంశాలతో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లులు లాగినట్లు ఉంది, డుబల్ మీనింగ్ డైలాగులు కూడా కథలో జొప్పించినట్లు తెలుస్తోంది.
ఫస్టాఫ్ రిపోర్ట్స్ అంత గొప్పగా ఏమీ లేక పోయనా... ఫర్వాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సెకండాఫ్‌లో దర్శకుడు చెప్పే కథ ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. మరి కాసేపట్లో సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ బయటకు రానుంది. ఈ చిత్రానికి 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మాత. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











