twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ టైటిల్‌తో కార్తీకేయ.. మరో లెవెల్‌కు తీసుకెళ్లే మూవీగా.. హిప్పీ షూటింగ్ ప్రారంభం!

    |

    Recommended Video

    'RX 100' Hero Karthikeya's Next Movie Titled As 'Hippi'

    తొలి చిత్రం 'RX 100' చిత్రం హిట్టు దెబ్బతో హీరో కార్తికేయ బూరెల బుట్టలో పడ్డాడు. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్టర్ 'హిప్పీ' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను నిర్మించబోయే ఈ చిత్రానకి టీఎన్ కృష్ణ దర్శకుడు. వీ క్రియేషన్స్ పతాకం రూపొందిస్తున్న 'హిప్పీ' షూటింగ్ నవంబర్ 9న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది.

    ఇక్కడే పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే శోభనం.. రానాతో పిచ్చెక్కించేలా చెప్పిన క్రేజీ బ్యూటీ!ఇక్కడే పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే శోభనం.. రానాతో పిచ్చెక్కించేలా చెప్పిన క్రేజీ బ్యూటీ!

    ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. " RX 100 సినిమా తర్వాత కథలు విన్నాను. నా గత చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా చేయాలనుకునే సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చింది. టాప్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి మరింత ఉత్సాహం కలిగింది. 'కబాలి' లాంటి పెద్ద సినిమా రూపొందిన బేనర్లో నటించడం నా అదృష్టం. ఈ సినిమా నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

    ‘హిప్పీ' అంటే...?

    ‘హిప్పీ' అంటే...?

    దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ... హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాక అతడి బాడీలాంగ్వేజ్‌ నా కథకు చక్కగా సరిపోతుంది అనిపించింది. ఈ చిత్రానికి ఆర్ డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేస్తున్నారని తెలిపారు.

     సినిమా మరో స్థాయికి

    సినిమా మరో స్థాయికి

    సినిమాటోగ్రాఫర్ ఆర్‌డీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''సూర్య, జ్యోతిక కలిసి నటించిన హిట్ చిత్రం ‘నువ్వు నేను ప్రేమ' తర్వాత కృష్ణతో కలిసి చేస్తున్న చిత్రం ఇది. హిప్పీ క్రేజీ టైటిల్. కథ చెప్పినప్పుడు వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోదామనిపించింది. తెలుగులో హ్యాపీ, ఘర్షణ చిత్రాలకు పనిచేశాను. మళ్లీ ‘హిప్పీ' చిత్రానికి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. కార్తికేయ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళతాడనే నమ్మకం ఉంది. హైదరాబాద్‌, శ్రీలంకలోని లోకేషన్ల‌లో షూట్ చేస్తామని తెలిపారు.

     శ్రీలంకలో భారీ షెడ్యూల్

    శ్రీలంకలో భారీ షెడ్యూల్

    నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ''హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది. కార్తికేయ కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ తర్వాత శ్రీలంకలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

    ‘హిప్పీ' నటీనటులు, టెక్నీషియన్స్

    ‘హిప్పీ' నటీనటులు, టెక్నీషియన్స్

    ఈ చిత్రంలో కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. దర్శకత్వం: టీఎన్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కే ప్రసన్న, ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, సాహిత్యం: అనంత శ్రీరాం, మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్, క్యాస్టూమ్: ప్రవీణ్, మేనేజర్లు: గోపి, ఏపీ పాల్ పాండి, పీఆర్‌వో: పులగం చిన్నారాయణ, డిజైన్లు: తండోరా.

    English summary
    RX100 fame Karthikeya next movie Hippi shooting commences today. T.N.Krishna is directing Hippi while S.Thanu is producing it under the prestigious banner of V Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X