హిప్పీకి సెన్సార్ క్లియర్.. జూన్ 6న రిలీజ్ డేట్ ఫిక్స్
RX 100' ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశీ జంటగా కలైపులి ఎస్. థాను సమర్పణలో వి. క్రియేషన్స్ పతాకంపై టిఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ 'హిప్పీ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు మంచి క్రేజ్‌ను పెంచాయి. కార్తీకేయ ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసేలా చేశాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హిప్పీపై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలు తగినట్టుగానే హిప్పీ చిత్రం సెన్సార్ అధికారులను సంతృప్తి పరిచింది. దాంతో ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
యూత్‌ఫుల్ రొమాంటిక్ హిప్పీ చిత్రాన్ని జూన్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. ఈ చిత్రంలో శ్రద్దాదాస్, జేడీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్


Click it and Unblock the Notifications











