ఆన్‌లైన్‌లో హిట్ 3 లీక్.. అలా చంపేస్తారా? గుండెలు బాదుకొంటూ పవన్, చిరంజీవికి లేఖ
తెలుగు సినిమా రంగానికి వరుస విజయాలు అందిస్తున్న వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాత ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన చిత్రం హిట్ 3. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు నటించారు. హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు.
అయితే మే 1వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజైన వెంటనే ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను తీవ్రంగా బాధిస్తున్నది. అయితే ఈ సినిమా పైరసీ బారిన పడటంపై ఓ డిస్ట్రిబ్యూటర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకొన్నారు. ఆయన సోషల్ మీడియాలో స్పందించిన వివరాల్లోకి వెళితే..

హిట్ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 3వ కేసుగా రూపొందిన హిట్ 3 సినిమాను సుమారుగా నాని రెమ్యునరేషన్ మినహాయించి 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు సుమారుగా 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండటంతో దాదాపు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తొలి రోజు రికార్డు లెవెల్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా రిలీజైన కొద్ది గంట్లలోనే హెచ్‌డీ వెర్షన్ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అక్రమంగా సినిమాలను పైరసీ చేసే అన్ని పాపులర్ వెబ్‌సైట్లలో ఈ సినిమా క్వాలిటీ ప్రింట్‌ను డౌన్ లోడింగ్ ఆప్షన్‌తో పెట్టారు. దాంతో ఈ సినిమా చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బు పెట్టి ప్రదర్శన హక్కులు కొనుగోలు చేశాం. ఇలా ఆన్ లైన్‌లో క్వాలిటీ ప్రింట్‌ను లీక్ చేస్తే మా పరిస్తితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఓ డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ సోషల్ మీడియాలో నానికి పోస్టు పెట్టారు. డియర్ నాని. 100 మంది స్టాఫ్‌కు జీతాలు చెల్లిస్తూ ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను. సినిమాపై నమ్మకంతో కోట్ల రూపాయలు వెచ్చించి రైట్స్ కొనుకొంటున్నాం. కానీ ఈ సినిమా రిలీజ్ రోజే పైరసీ బారిన పడటంతో హృదయం ముక్కలైంది. మా ఆదాయాన్ని ఈ పైరసీ గండికొడుతున్నది. ఆ కలలు, ఆశలపై ఇలా దెబ్బ పడింది అని పోస్టులో పేర్కొన్నారు.
హిట్ 3 సినిమా పైరసీ బారిన పడటం వల్ల మాకు నష్టం వస్తుందని ఆవేదన చెందడం లేదు. మా ప్యాషన్, హార్డ్ వర్క్‌ను తుంగలో తొక్కుతూ మా ఆశలను, కలలను చంపేస్తున్నారు. పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకోండి. మేమంత మీ వెనుక ఉంటాం అంటూ పవన్ కల్యాణ్, చిరంజీవి, దిల్ రాజును ఉద్దేశించి ట్వీట్ చేశారు. స్టాప్ పైరసీ, సినిమాను రక్షించండి అంటూ హ్యాష్ ట్యాగ్‌తో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై సినీ పెద్దలు, నాని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











