HIT 3 Trailer Review: హిట్ 3 ట్రైలర్ రివ్యూ.. జనాల మధ్య ఉంటే అర్జున్.. మృగాల మధ్య ఉంటే సర్కార్!

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 2. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ట్రైలర్‌ను వైజాగ్‌లోని సంగం థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3: ది థర్డ్ కేస్ సినిమాకు సంబంధించిన క్రూ వివరాల్లోకి వెళితే.. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరిస్తున్నారు.

HIT 3 Telugu Movie Trailer Review

హీరో నాని అర్జున్ సర్కార్‌గా రివీల్ కావడంతో హిట్ 3 ట్రైలర్‌ మొదలైంది. సార్ క్రిమినల్స్‌ అనే వారు భూమికి 10 అడుగుల సెల్‌లో లేదా 6 అడుగుల లోతు భూమిలో ఉండాలి. ఏ క్రిమినల్ అయినా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అవకాశం లేదు. అలా ఫీల్ అవడానికి పర్సనల్‌గా ఎఫెక్ట్ కానక్కర్లేదు. కేవలం పోలీస్ అయితే చాలు అంటూ నాని ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పాడు.

ఇదిలా ఉండగా, ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన బాధను చెప్పుకొంటూ.. పాపకు 9 నెలలు.. తీసుకెళ్లి చేసుకొంటాడు సార్.. వాడికి 5.10 హైట్ ఉంటాడు. అక్కడక్కడ తెల్ల గడ్డం ఉంటుంది అని చెబుతుంది. ఇదిలా ఉండగా, ఆపదల నుంచి ప్రజలను కాపాడటానికి ఎన్ని అహోరాత్రులు కష్టపడుతాడో ఆయనకు మాత్రమే తెలుస్తుంది అని ఓ పుజారి చెబుతుంటాడు.

ఇదిలా ఉండగా, నాని, శ్రీనిధి శెట్టి మధ్య సన్నివేశాలు కాస్త రొమాంటిక్‌గా ఉన్నాయి. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? అని అంటూ కళ్లలోకి చూస్తూ.. నువ్వు నచ్చావ్ అంటూ శ్రీనిధి చెబుతుంది. నిన్ను అర్జున్ అని పిలువాలా? లేదా సర్కార్ అని పిలువాలా? అని అడిగితే.. జనాల మధ్యలో ఉంటే అర్జున్ అని పిలువండి.. మృగాల మధ్య ఉంటే సర్కార్ అని పిలువు అని నాని బదులివ్వడం ద్వారా నాని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పకనే ట్రైలర్‌లో చెప్పారు.

మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. ఆ రాత్రికి ఆ లైన్‌ను క్రాస్ చేయబోతున్నాం అని నేరస్థుడు చెబితే.. మరో వైపు పుజారీ.. ఎన్ని పరీక్షలను తట్టుకొని నిగ్గు తేల్చాల్సి శక్తిని ఉన్న వాడు తప్పా.. ధర్మ సంస్థాపన వైపుకు, ధర్మ రక్షణ వైపుకు అడుగు వేయలేడు అంటూ కామెంట్ చేస్తాడు.

ఇక క్రిమినల్స్ పట్ల అర్జున్ సర్కార్ ఎలా ఉండబోతున్నాడనే విషయాన్ని చెప్పడానికి.. నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటూ ఓ అమ్మాయి పీక తెగనరకడం చూస్తే.. హిట్ 3 సినిమాలో నాని వీరంగం ఏ రేంజ్‌లో ఉంటుంది. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ హింసకు ఏ విధంగా పాల్పడుతాడో అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా సంకేతాలిచ్చాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు హిట్స్ వచ్చాయి. హిట్ 3 ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత గతంలో వచ్చిన రెండు సినిమాల కంటే ఎక్కువగానే మితి మీరిన హింస ఉండబోతుందనే విషయం రక్తంలో తడిసిన అర్జున్ సర్కార్ పాత్ర చెప్పింది. ఈ ట్రైలర్ ద్వారా నాని ఏ విధంగ చూపించబోతున్నామనే విషయాన్ని ప్రిపేర్ చేశారనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు, నాని పెర్ఫార్మెన్స్‌కు మే 1వ తేదీన ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: hit 3 nani sailesh kolanu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X