ట్రెండింగ్‌లో HIT: నాని సినిమా ట్రైలర్‌కి యమ క్రేజ్..
నాని నిర్మాణంలో తెరకెక్కిన HIT మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ భారీగా ఆదరణ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ లిస్ట్‌కి చేరింది. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకోవడంతో మంచి క్రేజ్ ఏర్పడి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పబ్‌లో మిస్ అయిన ప్రీతి అనే అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అసలు ఆ పబ్‌లో ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎలా అదృశ్యమైంది? చివరకు ఆ ఇన్వెస్టిగేషన్‌లో హీరో విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యాడా? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ కలగలుపుతూ కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.

నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ HIT సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తోంది. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో ఉన్న నాని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











