HIT ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి..
నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందిన సినిమా HIT. ఈ సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ఆయన సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరించింది. ఈ రోజు (ఫిబ్రవరి 28) ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే విదేశాల్లో ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సినిమాపై తమ తమ అభిప్రాయాలు తెలిపారు. అందులో కొన్ని ట్వీట్స్ పరిశీలిస్తే..

పెద్ద ఎత్తున ఆల్ ది బెస్ట్..
ట్విట్టర్ వేదికగా HIT సినిమా నిజంగానే సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఇటు నానికి, అటు విశ్వక్ సేన్‌కి పెద్ద ఎత్తున ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్ HIT
ఓ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు ఛేదించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా విశ్వక్ సేన్ నటించాడు. సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నట్లుగానే థ్రిల్ చేసిందని ట్వీట్స్ వస్తున్నాయి.
థ్రిల్ అయ్యా.. రివ్యూ వస్తే
ఈ సినిమా చూస్తూ బాగా థ్రిల్ అయ్యాను. మూవీ రివ్యూ వచ్చాక మీకే తెలుస్తుంది సినిమా ఎలా ఉందో.. అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు.
ఫస్టాఫ్ గురించి చెబుతూ..
HIT ఫస్టాఫ్ ఆవేరేజ్ గా ఉందని తెలుపుతూ మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యాడు. సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్వెల్ వరకు వెళ్లే సరికి ఆసక్తి రేకెత్తించిందని చెప్పాడు.

ప్రీతి కేసు ఇన్వెస్టిగేషన్.. స్క్రీన్ ప్లే
ప్రీతి కేసును ఇన్వెస్టిగేషన్ చేయడంలో విక్రమ్ గా (విశ్వక్ సేన్) నటన ఆకట్టుకుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ థిల్లర్ సన్నివేశాల్లో స్క్రీన్ ప్లే ఆకరించిందనే టాక్ వస్తోంది.
Recommended Video

ఇంటర్వెల్ ట్విస్ట్
ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చిన ఆసక్తికర ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత అంచనాలు పెంచేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఫస్టాఫ్ ఎక్సలెంట్ అని అంటున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..
డీసెంట్ ఫస్టాఫ్. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. విశ్వక్ సేన్ గుడ్ పర్‌ఫార్‌మెన్స్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.


Click it and Unblock the Notifications











