ప్రభాస్ కోసం స్టార్ డైరెక్టర్ కూతురు.. డార్లింగ్ ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయేలా!
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మందే స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగి భారతీయ సినిమాను శాసిస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఈ మధ్య కాలంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తోన్న అతడు.. సరైన ఫలితాలను అందుకుంటున్నాడు. దీంతో మరింత జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ చేసిన చిత్రాలు అంతగా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితుల్లో 'సలార్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఊపులోనే 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేశాడు. అదే 'ది రాజా సాబ్'. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హర్రర్ కామెడీతో రాబోతుంది.

ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న 'ది రాజా సాబ్' చిత్రంపై ప్రకటన అధికారికంగా రాలేదు. అయితే, ఈ సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది.
హర్రర్ అండ్ కామెడీ జోనర్‌లో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రం విజువల్ వండర్‌గా తెరకెక్కబోతుంది. ఇందుకోసం ఎంతో మంది టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో మారుతి కూతురు హియా దాసరి కూడా భాగం అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.
తాజాగా మీడియాతో మాట్లాడిన హియా దాసరి 'నేను ఎక్కువగా యాక్టింగ్, డైరెక్షన్ కంటే వీఎఫ్ఎక్స్ వైపు చూస్తున్నాను. ఇప్పుడు ది రాజా సాబ్ సినిమా కోసం పని చేస్తున్నాను. ఇది బిగ్ స్కేల్ ఉన్న ప్రాజెక్టు. ఇందులో విజువల్స్ కన్నులపండుగలా ఉంటాయి. ఇలాంటి భారీ చిత్రంలో భాగం కావడం హ్యాపీగా ఉంది' అని చెప్పింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











