హోలీ కిక్: సర్‌ప్రైస్ చేసిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ..! వైరల్ పిక్

నేడు (మంగళవారం) హొలీ పండగ సందర్బంగా జనమంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది హొలీ రంగులు వెదజల్లుకోవడం కాస్త తక్కువగానే కనిపిస్తున్నటికీ, జనంలో హొలీ జోష్ మాత్రం అలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ కిక్కిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. వివరాల్లోకి పోతే..

Recommended Video

NTR Posts Holi Wishes With Family Picture
ఎన్టీఆర్ సంబరాలు.. హోలీ స్పెషల్

ఎన్టీఆర్ సంబరాలు.. హోలీ స్పెషల్

ప్రస్తుతం RRR సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్.. హోలీ సందర్బంగా భార్యాపిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు. హోలీ సంబరాల్లో మునిగి తేలుతూ సరదాగా నాచురల్ రంగులు వెదజల్లుకున్నారు. ఈ మేరకు సదరు పిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.

భార్యాపిల్లలతో ఎన్టీఆర్.. వైరల్ పిక్

భార్యాపిల్లలతో ఎన్టీఆర్.. వైరల్ పిక్

హొలీ ఆడిన అనంతరం తన భార్యాపిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ పిక్‌లో ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఒకే ఫ్రెములో కనిపిస్తుండటం నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ అంతా తెగ షేర్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అయింది.

ఎన్టీఆర్ సినీ జర్నీ.. RRR

ఎన్టీఆర్ సినీ జర్నీ.. RRR

వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ టాప్ స్టార్‌గా మంచి జోష్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం RRR షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ అలా.. చెర్రీ ఇలా

ఎన్టీఆర్ అలా.. చెర్రీ ఇలా

RRR మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించబోతున్నారు. ఇక ఈ చారిత్రాత్మక చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.

త్రివిక్రమ్‌తో జతకట్టిన యంగ్ టైగర్

ఇకపోతే RRR షూటింగ్ జరుగుతుండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టారు ఎన్టీఆర్. ఇటీవలే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X