HCA Awards వేడుకలో రామ్ చరణ్ కు అవమానం.. క్షమాపణలు చెప్పిన హాలీవుడ్ నటి!

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటోంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ నామినేషన్లలో మొత్తంగా 5 కేటగిరీల్లో నామినేట్ అయి సత్తా చాటింది. అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్ కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ బహుమతులు..

అంతర్జాతీయ బహుమతులు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ జూనిర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. రౌద్రం రణం రుధిరం థియేటర్లు, ఓటీటీల్లో అనేక కలెక్షన్స్, రికార్డ్స్ కొల్లగొట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటేలా చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు సినీ ప్రముఖులు, విశ్లేషకులు, దర్శక దిగ్గజాలు, ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్సుతో పాటు పలు అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది.

ప్రతిష్టాత్మక అవార్డ్స్..

ప్రతిష్టాత్మక అవార్డ్స్..

ఇప్పటికే ఎన్నో అవార్డులను, రివార్డులను కైవసం చేసుకున్న రౌద్రం రణం రుధిరం సినిమా తాజాగా మరిన్ని అవార్డులను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా అవార్డులను ప్రకటించింది. ఇందులో RRR సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. ఇలా ఇన్ని ప్రతిష్టాత్మక అవార్డ్స్ సాధించిన తొలి భారతీయ సినిమాగా RRR రికార్డ్కెక్కింది.

 ఐదు విభాగాల్లో..

ఐదు విభాగాల్లో..

అంతేకాకుండా ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డ్స్ నామినేషన్స్‌ జాబితాను ప్రకటించింది. ఈ అవార్డ్సులో ఏకంగా ఐదు విభాగాల్లో RRR సినిమా నామినేట్ కావడం విశేషం. తాజాగా కాలిఫోర్నియాలో జరుగుతోన్న కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో రాజమైళి మూవీ RRR అవార్డులను గెలిచింది.

 అంజలి భీమానీతో..

అంజలి భీమానీతో..

ఇదిలా ఉంటే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకల్లో రామ్ చరణ్ కు అమెరికన్ నటి క్షమాపణలు తెలియజేసింది. HCA Awards ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో రామ్ చరణ్ కు ప్రత్యేక గౌరవం లభించింది. ఓ అవార్డ్ కు రామ్ చరణ్ ప్రజంటర్ గా వ్యవహరించారు. అయితే చెర్రీతోపాటు హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి స్టేజిపైకి రావాల్సి ఉంది. వీరిద్దరిని స్టేజీపైకి ఆహ్వానించే బాధ్యత హాలీవుడ్ స్టార్ నటి టిగ్ నొటారోకు అప్పగించారు.

పక్కనుంచి సాయం చేసినా..

పక్కనుంచి సాయం చేసినా..

చెర్రీని పిలిచే క్రమంలో.. RRRతో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అని కొంచెం గ్యాప్ ఇచ్చింది అమెరికన్ నటి టిగ్ నొటారో. చివరి పేరు ఎలా పలకాలో తెలియడం లేదని నటి చెప్పింది. మైక్రో ఫోన్ లో వెనుక నుంచి పేరు చెప్పడంతో చ్చరాన్ అని పలికింది టిగ్. తనకు పక్కనుంచి సాయం చేశారని చెప్పిన ఆమె ఆ తర్వాత కూడా రామ్ చరాన్ అన్నారు. అనంతరం అంజలి భీమానీ పేరు పలకడంలో కూడా కాస్తా తడబడ్డారు నటి టిగ్ నొటారో.

ఎదురెల్లి క్షమాపణలు చెప్పి..

అంజలీ.. భీమానీ అంటూ గ్యాప్ ఇచ్చి నటి టిగ్ నొటారో. దీంతో అక్కడున్న ఆడెయిన్స్ ఒక్కసారిగా నవ్వేశారు. ఇగ వారిద్దరూ స్టేజిపైకి ఎక్కి వస్తుండగా ఎదురెళ్లిన ఆమె రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పింది. తనకు నోరు తిరగకపోవడంతో అలా జరిగిందని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే భారతీయ తెలుగు ప్రేక్షకులు నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని గంపెడు ఆశలతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X