‘వాల్మీకి’ సెట్స్‌లో ఆస్కార్ విన్నర్ సందడి, మురిసి పోయిన హరీష్ శంకర్!
వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్మీకి' మూవీ సెట్లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్‌సన్ సందడి చేశారు. సినిమాలోని కొన్ని సీన్లు షూట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ హరీష్ శంకర్ మురిసిపోయారు.
గాడ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, మూడు సార్లు ఆస్కార్ అవార్డు విన్నర్... మన కోసం కెమెరా ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుంది... ఆయన కెమెరా హ్యాండిల్ చేస్తుండగా నేను యాక్షన్ చెప్పడం మరిచిపోలేని అనుభూతి' అంటూ హరీష్ శంకర్ ట్విట్ చేశారు. రాబర్ట్ రిచర్డ్‌సన్... జెఎఫ్‌కె(1991), ది ఏవియేటర్(2004), హ్యూగో(2011) చిత్రాలకు ఆస్కార్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.

'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ ప్లాస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలోనిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.
కాగా.. ఈ చిత్రానికి 'వాల్మీకి' టైటిల్ పెట్టడంపై బోయ వాల్మీకి కులానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.వాల్మీకి అనేది తమ కులానికి చెందిన దైవం పేరు అని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టి స్టిల్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ మార్చే ఆలోచనలో ఉందట.


Click it and Unblock the Notifications











