మాధవన్ చిత్రంలో హాలీవుడ్ తారలు.. వారెవరంటే!
విలక్షణ నటుడు ఆర్ మాధవన్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం రాకెట్రీ. అంతరిక్ష పరిశోధన నేపత్యంగా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నటుడు రాన్ డొనాచీ, డౌన్‌టౌన్ అబే నటి ఫిలీస్ లోగన్ కీలక పాత్రల్లోకి దించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
హలీవుడ్ తారల చేరికను స్వయంగా ఆర్ మాధవన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. రాకెట్రీ సినిమా గురించి ఓ కీలకమైన వార్తను అందిస్తున్నాను. రాన్ డోనాచీ, ఫిల్లీస్ లోగన్ ఇద్దరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారితో కలిసి నటించడం నాకు గర్వంగా ఉంది. వారికి సహృదయంతో ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

రాకెట్రీ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ సెర్బియాలో షూట్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ సభ్యులందరికీ విందును ఏర్పాటు చేశారు. మాధవన్ నటించిన రెహ్న హై తేరే దిల్ మే చిత్రంలోని పాటలను ప్లే చేశారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు అందించిన సహకారం మరువులేనిదని ట్వీట్ చేశారు. తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న రాకెట్రీ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో మాధవన్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











