నాగార్జున కోసం హాలీవుడ్ నుంచి వచ్చారు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.!
అక్కినేని నాగేశ్వర్రావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అప్పటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నారు. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగ్ గత చిత్రం వచ్చి చాలా రోజులు అవుతున్నా.. మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే..

వన్ మ్యాన్ షో అనుకుంటే.. ఒక షోకే తేలిపోయింది
=ఇటీవల నాగార్జున ‘మన్మథుడు 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. నాగ్ వన్ మ్యాన్ షో అంటూ ప్రచారంతో విడుదల అయిన ఈ సినిమా.. మొదటి షోకే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో నాగ్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

అక్కడ మాత్రం అలరించాడు.. ఫ్యాన్స్ ఖుషీ
‘మన్మథుడు 2' సాధారణ ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులకూ నచ్చలేదు. దీంతో వాళ్లంతా నిరాశకు లోనయ్యారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఓ టీవీ చానెల్‌లో ప్రసారం అయిన ‘బిగ్ బాస్' షో ద్వారా నాగ్ ఫ్యాన్స్‌కు కొంత ఊరట లభించింది. ఈ షో మొత్తంలో ఆయన వ్యవహరించిన తీరు అందరికీ నచ్చింది. దీంతో బుల్లితెర రికార్డులు కూడా బద్దలైపోయాయి.

బంగార్రాజుగా వస్తాడనుకుంటే
ఎన్నో అంచనాలతో వచ్చిన ‘మన్మథుడు 2' నిరాశ పరచడంతో తన తదుపరి చిత్రాల విషయంలో అక్కినేని నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బంగార్రాజు'ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ కథతో నాగ్ అంతగా తృప్తి పడని కారణంగానే ఆయన దీనిని తాత్కాలికంగా పక్కన పెట్టేశారని టాక్.

మరోసారి అలాంటి పాత్రతో వస్తున్నాడు
అక్కినేని నాగార్జున త్వరలోనే ఓ సినిమాను అధికారికంగా ప్రారంభించబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘ఊపిరి' సినిమాకు రైటర్‌గా పని చేసిన సోలమన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారని అంటున్నారు. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో అలా.. హాలీవుడ్ నుంచి వచ్చారు
పోలీస్ ఆఫీసర్ కథతో వస్తున్న ఈ సినిమాలో ఎన్నో సాహసోపేతమైన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. దీని కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లు వచ్చారని, ప్రస్తుతం వాళ్ల నుంచి నాగార్జున శిక్షణ తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అరవై ఏళ్ల వయసులో నాగార్జున సాహసాలు చేయబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











