మరో అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేస్తున్న KGF మేకర్స్.. లేడి డైరెక్టర్, స్టార్ హీరోతో బిగ్ బడ్జెట్ మూవీ!

సినిమా ప్రపంచంలో కెరీర్ ను మలుపు తిప్పే ఒకే ఒక్క సినిమా చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు సరైన క్రమంలో దాని ఉపయోగించుకుంటే మాత్రం వారికి తిరుగు ఉండదు అని చెప్పవచ్చు. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కూడా ఇప్పుడు అదే తరహాలో అడుగులు వేస్తోంది. ఈ నిర్మాణ సంస్థ ఇదివరకే కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకుంది. ఇక KGF సినిమాతో మాత్రం ఈ నిర్మాణ సంస్థకు ఒక్కసారిగాదేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇక రాబోయే సినిమాలతో కూడా ఈ నిర్మాణ సంస్థ తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. కొద్దిసేపటి క్రితమే వీరు అఫీషియల్ గా మరొక కొత్త ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా గుర్తింపు

దేశవ్యాప్తంగా గుర్తింపు

హీరో యష్ నటించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ KGF చాప్టర్ 1 ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దానికి కొనసాగింపుగా వచ్చిన KGF 2 సినిమా కూడా అంతకు మించి అనేలా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది.

ఇక హీరో యష్ గూడా తన స్థాయిని అమాంతంగా పెంచుకున్నాడు. మొదటిసారి కన్నడ దర్శకనిర్మాతలకు నటీనటులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు

అయితే KGF ద్వారా వచ్చిన క్రేజ్ ను నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. వారి మార్కెట్ ను మరింత పెంచుకోవాలని డిసైడయ్యారు. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేయబోయే తదుపరి సినిమాలకు కూడా ఈ నిర్మాణ సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రభాస్ తో సలార్ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే కొత్త సినిమా కూడా ఈ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతోంది. ఆ తర్వాత కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

లేడి డైరెక్టర్ తో న్యూ ప్రాజెక్ట్

ఇక రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మరో కొత్త ప్రాజెక్టు పై కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధ కొంగరతో ఒక బిగ్ బడ్జెట్ తో సినిమా చేయడానికి నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక నిర్మాణ సంస్థ నుంచి ఆ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమాను కూడా నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లుగా వివరణ ఇచ్చారు.

హీరో ఎవరంటే..

హీరో ఎవరంటే..

ఇక ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న ఒక టాక్ ప్రకారం అయితే అందులో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సుధ కొంగర ఈ టాలెంటెడ్ హీరోతో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపు అందుకుంది. ఇక రెండవసారి ఈ కాంబినేషన్ ను కలుపుతున్న హోంబలే ఫిలిమ్స్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X