శ్రీ రెడ్డి రచ్చ రంబోలా.. అది కూడా బిగ్‌బాస్ హౌస్‌లో! ఇక ఆగగలమా..?

Recommended Video

Actress Sri Reddy To Participate In Big Boss Season 3 || Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో ఎంతోమంది ప్రముఖులు తనను వాడుకొని మోసం చేశారని నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్ కానుందట. నోటికేదొస్తే అది మాట్లాడటం, ఏ మాత్రం సిగ్గు పడకుండా విషయాన్ని పటాపంచలు చేయడం శ్రీ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్ కానుందనే వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మామూలుగానే నానా రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇక బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడితే రచ్చ రంబోలె అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మకాం మార్చి

మకాం మార్చి

హైదరాబాద్ లో కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై నానా హంగామా చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది శ్రీ రెడ్డి. అయినా టాలీవుడ్‌లో ఆమెను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తిన్నగా తమిళనాడుకు మకాం మార్చింది శ్రీ రెడ్డి. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది.

శ్రీ రెడ్డి నైజం

శ్రీ రెడ్డి నైజం

శ్రీ రెడ్డి బూతు పురాణం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగానే ఆమె రెచ్చిపోయిందనే హద్దులు ఉండవు. ఇక సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులైతేనా.. చెప్పుకోలేం బాబోయ్! వాడకూడని పదజాలం ప్రయోగిస్తూ నానా రచ్చ చేసేస్తుంటుంది. తన కోపాన్ని హద్దులు మీరు ప్రదర్శిస్తుంటుంది.

బిగ్‌బాస్ ఎంట్రీ

బిగ్‌బాస్ ఎంట్రీ

శ్రీ రెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లో కాలుమోపనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే తెలుగులో కాదు లెండి తమిళంలో. ప్రస్తుతం సన్నాహాల దశలో ఉన్న తమిళ బిగ్ బాస్ 3 లో ఓ పార్టిసిపెంట్ గా ఆమెకి ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. గత రెండు సీజన్ లకు హోస్ట్ గా చేసిన కమల్ హాసన్.. మూడో సీజన్ లో కూడా హోస్ట్ గా చేయనున్నారు.

రచ్చ తట్టుకోగలమా..?

రచ్చ తట్టుకోగలమా..?

బాస్ హౌస్ లో శ్రీ రెడ్డి అనే మాట వినగానే అందరి కామెంట్ ఒక్కటే.. అదే రచ్చ తట్టుకోగలమా..? అసలే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, పోట్లాటలు, మాటల యుద్దాలు ఎక్కువ. అలాంటి ఈ షో కి శ్రీ రెడ్డి లాంటి మహా మాటకారిని తీసుకొస్తే ఇంకేమన్నా ఉందా! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఏం జరగనుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X