అనసూయపై వల్గర్ కామెంట్స్, వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ బ్యూటీ

జబర్దస్త్ బ్యూటీ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోలు చూసిన కొందరు ఆకతాయి ఆన్‌లైన్ కుర్రోళ్ళు ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారట. ఈ విషయాన్ని పేర్కొంటూ అనసూయ పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇంతకీ అనసూయకు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి పోతే..

 సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్..

సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్..

గత కొన్ని రోజులుగా అనసూయపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ పెడుతున్నారట కొందరు ఆకతాయిలు. ఆమెపై అసభ్య కరమైన వ్యాఖ్యలు చేస్తూ మానసిక వ్యధకు గురి చేస్తున్నారట. దీంతో చూసి చూసి వాటిపై ఘాటుగానే రియాక్ట్ అయింది అనసూయ.

ట్విటర్ నిర్వాహకులకు రిక్వెస్ట్.. ఊహించని పరిణామం

ట్విటర్ నిర్వాహకులకు రిక్వెస్ట్.. ఊహించని పరిణామం

తనకు వచ్చిన ఆ ట్వీట్‌ స్క్రీన్‌షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌పై చర్యలు తీసుకోవాలని అనసూయ ట్విటర్ నిర్వాహకులను కోరింది. అయితే వారి నుంచి అనసూయకు ఊహించని పరిణామం ఎదురుకావడంతో చివరకు సైబర్ క్రైం పోలీసులకు మ్యాటర్ చెప్పేసింది అనసూయ.

ట్విట్టర్ టీమ్ రిప్లై.. తప్పేమీ కనిపించడం లేదంటూ షాక్

ట్విట్టర్ టీమ్ రిప్లై.. తప్పేమీ కనిపించడం లేదంటూ షాక్

అనసూయ ట్వీట్‌పై స్పందించిన ట్విట్టర్ టీమ్.. ''మీరు ఇచ్చిన ఫిర్యాదుపై మేం దర్యాప్తు చేస్తాను కానీ.. మాకు ఇందులో తప్పేమీ కనిపించడంలేదు. ఒకవేళ మీకు తప్పు ఉందని మీకు అనిపిస్తే ఏం జరిగిందో మాకు తెలియజేయండి'' అని రిప్లై ఇచ్చారు.

సైబర్ క్రైం పోలీసులకు పంపిన అనసూయ

దీంతో తనపై వచ్చిన వల్గర్ కామెంట్స్ ట్వీట్‌ను, కంప్లైంట్ చేస్తే ట్విటర్ ఇచ్చిన రిప్లైను స్క్రీన్‌షాట్ తీసి సైబర్ క్రైం పోలీసులకు పంపించిన అనసూయ.. ''డియర్ ట్విటర్ సపోర్ట్.. దయచేసి మీ రూల్స్‌ మార్చుకోండి. ఇది ట్విటర్ వైలేషన్ కాకపోతే మరేంటి? దీనిని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు. దయచేసి ఈ ట్వీట్స్‌పై చర్యలు తీసుకోవడానికి సరైన అధికారులను ట్యాగ్ చేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను కోరుకుంటున్నాను'' అని పేర్కొంది.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show
సిగ్గుపడటం లేదని చెబుతూనే అనసూయ

సిగ్గుపడటం లేదని చెబుతూనే అనసూయ

అంతేకాదు ఇలా వల్గర్ కామెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనసూయ కోరింది. తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమి సిగ్గుపడటం లేదని, సరైన వ్యవస్థలు చర్య తీసుకుంటే భవిష్యత్‌లో ఇలాంటివి జరగవని అంటోంది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X