పుర్రెల మధ్య హీరోయిన్ల అందాలు.. హాట్ హాట్ పూజా హెగ్డే.. ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో!

సినిమా ప్రమోషన్లకు కాదేదీ అనర్హం అన్నట్లుగా దూసుకుపోతోంది నేటి డిజిటల్ యుగం. తమ సినిమా షూటింగ్ మొదలు నుంచి స్టార్ట్ చేసి ఎదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటున్నారు నటీనటులు. అయితే అలాంటి వాటిలో కొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదే కోవలో తాజాగా తన 'హౌస్ ఫుల్ 4' నిమిత్తమై అక్షయ్ కుమార్ పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

పుర్రెల మధ్య హీరోయిన్ల అందాలు

తాజాగా అక్షయ్ కుమార్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేశాడు. అందులో ఆయనతో పాటు అందాల భామలు కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్భందా ఉన్నారు. అయితే వీరి మధ్యలో పుర్రెలు కూడా ఉండటం.. ఆ పుర్రెల మధ్య హీరోయిన్ల అందాలు చమక్కుమంటుండటం ఈ ఫొటోలో ఆకర్షనీయాంశం.

ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో

ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో

ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పిక్ పోస్ట్ చేసిన అక్షయ్ కుమార్.. అంతకంటే ఆసక్తికరమైన కాప్షన్ దానికివ్వడం విశేషం. హౌస్ ఫుల్ ఆఫ్ త్రోన్స్.. ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో స్క్రిప్ట్ మాత్రమే నిర్ణయిస్తుంది అంటూ సినిమాను ఉద్దేశించి అక్షయ్ కామెంట్ చేశారు. ఈ రకంగా సినిమాపై కూడా హైప్ క్రియేట్ చేశారు అక్షయ్.

పూజా అట్రాక్షన్.. ఆమె కాప్షన్

పూజా అట్రాక్షన్.. ఆమె కాప్షన్

మరోవైపు పూజా హెగ్డే కూడా ఇదే పిక్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక ఆమె పెట్టిన కాప్షన్ చూస్తే.. ఇది ఫైనల్ షెడ్యూల్.. ఏం జరుగుతుందో? హౌస్ ఫుల్4 #రీ పోస్ట్ అని పేర్కొంది. ఈ పిక్‌లో ముగ్గురు హీరోయిన్ల అందాలు యమ అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పూజా అయితే మరీ హాట్‌గా ఉంది.

ఫొటోని పరిశీలిస్తే..

ఫొటోని పరిశీలిస్తే..

ఇక ఈ డిఫెరెంట్ పిక్ ని పరిశీలిస్తే.. వరసగా లెఫ్ట్ నుంచి రైట్ కు రితీష్ దేశ్ ముఖ్, కృతి సనన్, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్, కృతి కర్భందా ఉన్నారు. పుర్రెలపై కూర్చున్న వీరంతా నవ్వులు చిందిస్తూ భయపెడుతున్నారా? లేక కనువిందు చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి ఇలా డిఫెరెంట్‌గా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు నటీనటులు.

హౌస్ ఫుల్ 4 మూవీ

హౌస్ ఫుల్ 4 మూవీ

ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో హౌస్ ఫుల్ 4 తెరకెక్కుతోంది. హౌస్ ఫుల్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్, కృతి కర్భందా, రితీష్ దేశ్ ముఖ్, దగ్గుబాటి రానా తదితరులు నటిస్తున్నారు. నడయాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X