Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విమర్శలకు తావిస్తున్న ప్రెగ్నెంట్ లేడీ అందాల ప్రదర్శన.. మరో సెన్సేషనల్ పిక్
ప్రియుడు జార్జ్ పనాయొటో చెట్టాపట్టాలేసుకు తిరిగి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది రోబో భామ అమీ జాక్సన్. అంతటితో ఆగక తాను పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించింది ఈ బ్రిటిష్ భామ. దీంతో అప్పట్లో ఆమె దైర్యం చూసి ఆశ్చర్య పోయారంతా. ఎంతైనా బ్రిటిష్ భామ కదా! ఈ మాత్రం తెగువ ఉండకపోతే ఎలా? అనుకున్నారు నెటిజన్లు. కానీ ఇప్పుడు నిండు గర్భంతో ఉంది కూడా సెక్సీగా పోజులిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
మన దేశంలో ప్రెగ్నెంట్ లేడీ అంటేనే అదో రకమైన గౌరవం. అంతే కాదు నిండు గర్భిణీని దిష్టి తలుగుతుందనే ఉద్దేశంతో కనీసం బయటకు కూడా రానివ్వరు. అలాంటిది అమీ మాత్రం సెక్సీ ఫోజులతో రెచ్చిపోతుండటం భారతీయులకు మింగుడు పడటం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.
ప్రస్తుతం మొరాకో దేశంలోని లా మెమోనియా మెరాకెచ్ అనే ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో హాయిగా సేదదీరుతోంది అమీ జాక్సన్. ప్రియుడు, కాబోయే భర్త ప్రియుడు జార్జ్ పనాయొటోతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. అక్కడ దిగిన ఒక ఫోటో షేర్ చేసి విమర్శలు కూడగట్టుకుంది అమీ. హోటల్ బాల్కనీలో నిలబడి బైట కనిపిస్తున్న పచ్చటి చెట్లను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సెక్సీ ఫోజ్ ఇచ్చింది అమీ. ఈ పిక్ లో బేబీ బంప్ తో కూడిన ఈమె అందాలు బయటపడుతున్నాయి. ఈ ఫోటోకు "గుడ్ మార్నింగ్ ప్యారడైజ్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ బ్రిటిష్ సుందరి.
ఈ ప్రెగ్నెంట్ భామ టాప్ వేసుకుంది కానీ ప్యాంట్ వేసుకోకపోవడంతో ఆమె టైస్ మొత్తం ఫోకస్ అవుతున్నాయి. ఈ హాట్ షోను కాస్త మోడ్రన్‌గా ఉన్న జనాలు తప్ప అందరూ ఓపెన్‌గా స్వీకరించడం కష్టం కదండీ. అందుకే కొందరు ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఈమె ఇంటర్నేషనల్ ఫిగర్ కాబట్టి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు లెండి!