twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వీడియో పోస్ట్ చేసి అల్లు అర్జున్‌ని ఇరికించిన శ్రీయ.. ఇక స్నేహారెడ్డికి తప్పదేమో!

    |

    కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్ టైమ్.. సెలబ్రిటీలు మొదలుకొని సాధారణ జనం వరకూ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఈ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తున్నారు. అయితే శ్రీయ మాత్రం ఓ వెరైటీ ఆలోచన చేసింది. అంతేకాదు అందులో అల్లు అర్జున్‌ని కూడా ఇరికించేసింది. ఇంతకీ శ్రీయ ఏం చేసింది. దానికి బన్నీకి లింకేంటి? వివరాలు చూద్దామా..

    దేశం మొత్తం లాక్‌డౌన్.. సినీ ప్రముఖులు

    దేశం మొత్తం లాక్‌డౌన్.. సినీ ప్రముఖులు

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఏప్రిల్ 14 దాకా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. ఈ పరిస్థితుల్లో షూటింగ్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఫ్లయిట్స్ అన్నీ బంద్ కావడంతో సినీ ప్రముఖులు సైతం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ భార్యాపిల్లలతో సరదాగా గడుపుతున్నారు. కొందరైతే ఈ సరదా సమయంలో వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు.

    భర్త అండ్రీ కొస్చీవ్‌తో అలాంటి పనులు

    భర్త అండ్రీ కొస్చీవ్‌తో అలాంటి పనులు

    అలాంటి ఓ వెరైటీ ఆలోచన చేసిన సీనియర్ హీరోయిన్ శ్రీయ.. తన భర్త అండ్రీ కొస్చీవ్‌తో గిన్నెలు తోమించింది. అంతేకాదు కొందరు హీరోలను నామినేట్ చేస్తూ.. వాళ్ళు కూడా తమ భార్యలు కోసం ఇలాంటి పని చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఆ లిస్టులోనే ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

    అల్లు అర్జున్‌ని ఇరికించిన శ్రీయ.. ఛాలెంజ్

    అల్లు అర్జున్‌ని ఇరికించిన శ్రీయ.. ఛాలెంజ్

    ఈ మేరకు తన భర్త అంట్లు తోముతున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రీయ. దానికి ''గిన్నెలను శుభ్రం చేయండి'' అని కాప్షన్ జోడిస్తూ కొందరు మిత్రులకు ఆ ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో అల్లు అర్జున్ తో పాటు ఆర్య, ఆశిష్ చౌదరి, జయం రవి ఉన్నారు. సో వీళ్లంతా తమ భార్యల కోసం అంట్లు తోమాలన్నమాట.

    అందుకోసమే పెళ్లి చేసుకున్నా.. గాఢమైన కిస్

    అందుకోసమే పెళ్లి చేసుకున్నా.. గాఢమైన కిస్

    ఈ సందర్భంగా ఆ వీడియోలో మాట్లాడిన శ్రీయ.. తనకు గిన్నెలు తోమడం ఇష్టముండదని, అందుకోసమే తన భర్తను పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితిలో పెళ్లయిన మగవాళ్ళంతా వారి అందమైన భార్యలకు ఏ విధంగా సాయం చేస్తారో చూపించాలని తాను ఈ ఛాలెంజ్ విసురుతున్నట్లు పేర్కొంది. చివరకు భర్తకు గాఢమైన కిస్ ఇచ్చింది శ్రీయ.

    బన్నీ భార్య స్నేహారెడ్డికి తప్పదేమో!

    సో.. శ్రీయ విసిరిన ఈ ఛాలెంజ్ చూస్తుంటే మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా అంట్లు తోమాల్సివస్తుందేమో అనిపిస్తోంది. ఒకవేళ బన్నీ ఆ ఛాలెంజ్ స్వీకరించి భార్య కోసం అంట్లు తోమితే శ్రీయ లాగే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా వీడియో తీయకతప్పదు మరి. చూద్దాం బన్నీ ఎలా రియాక్ట్ అవుతారనేది.

    English summary
    Shriya Saran Bhatnagar, also known as Shriya, is an Indian actress and model known for her work in South Indian cinema. In quaratine time she challenged with Allu Arjun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X