twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ అంటూ అమ్మాయిలకు వల.. పోలీస్ స్టేషన్‌లో రౌడీ స్టార్ ఫిర్యాదు

    |

    టెక్నాలజీ విస్తరిస్తున్నా కొద్ది సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని ఎంతోమంచి సైబర్ నేరగాళ్లు తమ తమ నేర ప్రవృత్తిని బయటపెడుతున్నారు. ఇప్పటికే సైబర్ మోసాలు ఎన్నో నమోదు కాగా, తాజాగా పోలీసులే విస్తుపోయే సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. పైగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా భాగం కావడం హాట్ ఇష్యూగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

    విజయ్ దేవరకొండ.. అమ్మాయిల్లో క్రేజ్

    విజయ్ దేవరకొండ.. అమ్మాయిల్లో క్రేజ్

    అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం తన క్రెడిట్ పెంచేసుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత గీతగోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో అమ్మాయిల మనసు దోచేశాడు. విజయ్ దేవరకొండ మేనరిజం చూసి లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా యమ క్రేజ్ కొట్టేశాడు మన రౌడీ స్టార్.

    విజయ్ దేవరకొండ పేరు.. అమ్మాయిలు ట్రాప్

    విజయ్ దేవరకొండ పేరు.. అమ్మాయిలు ట్రాప్

    సరిగ్గా ఇదే పాయింట్ తమ తీసుకొని తమ తమ టాలెంట్ బయటపెట్టాడు ఓ ప్రబుద్దుడు. విజయ్ దేవరకొండ పేరు వాడేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలు పెట్టాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సహా అంతా ఆశ్చర్యపోయారు.

    నా డబ్బింగ్‌ ఆర్టిస్టు అంటూ మోసం..

    నా డబ్బింగ్‌ ఆర్టిస్టు అంటూ మోసం..

    విజయ్‌ దేవరకొండ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా చాటింగ్‌ చేస్తూ.. ఆ తర్వాత 'నా డబ్బింగ్‌ ఆర్టిస్టుతో చాటింగ్‌ చేయండి' అంటూ తన అసలు ఫేస్‌బుక్ ఖాతాను అమ్మాయిలకు పంపిస్తున్నాడు. దీంతోపాటు తన ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చి.. ఆ తర్వాత వారిని ముగ్గులోకి దించుతున్నాడు.

    Recommended Video

    Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic | Filmibeat Telugu
     రౌడీ స్టార్ ప్లాన్.. అలా బుక్కయ్యాడు

    రౌడీ స్టార్ ప్లాన్.. అలా బుక్కయ్యాడు

    ఈ విషయం విజయ్‌ దేవరకొండ దృష్టికి రావడంతో.. ఆ సైబర్ నేరగాడి మోసాన్ని కట్టడి చేసేందుకు పెద్ద ప్లాన్ వేసి మరీ దొరకబాట్టేశాడు మన రౌడీ స్టార్. తన సహాయకుడితో అమ్మాయిలా ఆ మోసగాడితో చాటింగ్‌ చేయించి.. ఆ సైబర్ మోసగాడి భాగోతాన్ని నిర్ధారణ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

    పోలీసులకు ఫిర్యాదు.. కొనసాగుతున్న విచారణ

    పోలీసులకు ఫిర్యాదు.. కొనసాగుతున్న విచారణ

    ఆ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విజయ్ దేవరకొండ. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. విజయ్‌ దేవరకొండ పేరుతో చాలా కాలం నుంచి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో ఓ యువకుడు అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

    విజయ్ దేవరకొండ ఫైటర్

    విజయ్ దేవరకొండ ఫైటర్

    ఇకపోతే ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం 'ఫైటర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Vijay Deverakonda gave a police complaint. He reported that somebody using his name and trapped ladies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X