Game Changer: గేమ్ ఛేంజర్‌ను తొక్కేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు పెద్ద బిజినెస్ కూడా అని అందరికీ తెలిసిందే. ఒక సినిమా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతోమందికి జీవన ఉపాధి కూడా కలుగుతుంది. అయితే ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమాలు పోషిస్తున్న పాత్ర ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాలీవుడ్ లెవెల్ క్వాలిటీతో సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాలు మేకర్స్ చేస్తున్నారు.
కానీ ఈ ప్రయత్నాల్లో పలు భారీ సినిమాలు ఆ ఎఫర్ట్స్ కి తగ్గ ఫలితాలు అందుకోవడం లేదు. లేటెస్ట్ గా అయితే ఈ తరహా భారీ సినిమాలకి ఎవరో కాదు మన తెలుగు ఆడియెన్స్ నే విలన్స్ గా మారుతున్నారు. అది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్, రెగ్యులర్ ఆడియెన్స్ కాదు. కేవలం కొన్ని వర్గాల ఆడియెన్స్ మాత్రమే వాంటెడ్ నెగిటివిటీ కనీసం సినిమాలు చూడకుండానే చేస్తుండడం పలు సినిమాలని చంపేస్తున్నాయి.

కాగా ఈ సినిమాల్లో లేటెస్ట్ గా వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్ తో చాలా డ్రామాలు బయటకి వచ్చాయి. ఈ సినిమాకి జరిగిన నెగిటివిటీ అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యిన రోజునే సినిమా ఫుల్ క్లారిటీ ప్రింట్ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. దీనితో అందరి మొబైల్ ఫోన్స్ లో సినిమా ఫ్రీగా దొరికేయడంతో చాలా మంది అవే చూసి ఆగిపోయారు.
అంతేకాకుండా బస్సుల్లో, టీవీ కేబుల్ ఛానెల్స్ లో కూడా సినిమాని వేసి థియేటర్స్ కి జనం రాకుండా చేశారు. దీనితో గేమ్ చేంజర్ కి భారీ నష్టాలు ఇవి కలుగజేసాయి. దీనితో మేకర్స్ తమ సినిమా పట్ల కుట్ర జరిగింది అని స్వయంగా స్పందించడం, సంగీత దర్శకుడు థమన్ కూడా తమ సినిమాకి పాటలు లీక్ చేసిన వారితోనే సినిమా మొత్తం వర్క్ చెయ్యాల్సి వచ్చింది అని ఒకదానిని మించి ఒకటి ట్విస్ట్ బయటకి వస్తున్నాయి.
కాగా ఈ చిత్రానికి దిల్ రాజు తన కెరీర్ లోనే ఏ సినిమాకి పెట్టని రేంజ్ భారీ బడ్జెట్ 400 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇలాంటి సినిమాని కేవలం 4 కోట్ల ఖర్చుతో చంపేశారు అంటూ కొత్త ట్విస్ట్ ఇపుడు బయటకి వచ్చింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి వాటిలో కొందరు వాంటెడ్ గా భారీ ఖర్చు చేసి సినిమాని ప్లాప్ చెయ్యాలనే నెపంతోనే 4 కోట్లు ఖర్చు చేసి మరీ గేమ్ ఛేంజర్ ని చంపేశారు అంటూ ఓ టాక్ ఇపుడు బయటకి వచ్చింది.

అల్టిమేట్ గా ఇపుడు థియేటర్స్ కి జనాన్ని రప్పించడం కంటే ముందు చేతులో ఫోన్ పట్టుకొని ఉన్న నెటిజన్స్ కి సమాచారం స్ప్రెడ్ అయ్యేదే ఈ సోషల్ మీడియాలో. మరి అలాంటి యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా పేజెస్ లో పదే పదే నెగిటివ్ టాక్ రుద్దితే డెఫినెట్ గా వెళ్లే జనం కూడా థియేటర్స్ కి వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఆ రేంజ్ లో ప్రభావం చూపిస్తున్నాయి.
సో అవే టార్గెట్ పెట్టుకొని కొందరు కావాలనే 4 కోట్లు మేర ఖర్చు చేసి 400 కోట్లకి పైగా బడ్జెట్ ఠీ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమాని చంపేశారు అంటూ కొత్త టాక్ మొదలైంది. మరి దిల్ రాజు అండ్ టీం తమ సినిమాకి ఈ రేంజ్ లో నెగిటివ్ చేయడం వెనుక ఎవరో 40 మంది ముఠా ఉన్నారని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారో అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











