వారేం తింటారో తెలుసుకోవాలి..హృతిక్ రోషన్ కామెంట్స్.. సౌత్ స్టార్స్‌పై పొగడ్తల వర్షం!

సౌత్ సినీ ఇండస్ట్రీని ఒకప్పుడు బాలీవుడ్ జనాలు చిన్నచూపు చూసేవారు. భారత సినీ పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ అని మాత్రమే భ్రమ పడేవారు. అయితే కొద్ది కొద్దిగా మార్పులు వస్తున్నాయి. బాలీవుడ్ కూడా కథలకోసం దక్షిణాదివైపు చూస్తోంది. ఇక్కడ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలను చూస్తే కోణం మారిపోయింది.

దూసుకుపోతోన్న తమిళ, తెలుగు పరిశ్రమలు..

దూసుకుపోతోన్న తమిళ, తెలుగు పరిశ్రమలు..

టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు బాలీవుడ్‌కు ధీటుగా దూసుకుపోతున్నాడు. ఇక్కడి హీరోలు కూడా రెండు వందల కోట్లు, మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తమిళం నుంచి రజినీ, విజయ్, అజిత్ వంటి వారు రూ. 200కోట్లను అవలీలగా రాబట్టేస్తున్నారు.

బాహుబలితో ప్రపంచస్థాయి..

బాహుబలితో ప్రపంచస్థాయి..

బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఘనత ప్రపంచస్థాయికెక్కింది. దేశ విదేశాల్లో బాహుబలి సినిమా ఘన విజయం సాధించగా..టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. సాహో, సైరా వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెలుగులో నిర్మించారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ మల్టీ స్టారర్ రాబోతోంది. ఇలా దక్షిణాది సినిమాలు, పరిశ్రమ, ఇక్కడి హీరోలు బాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకుపోతున్నారు.

చెన్నైలో హృతిక్ సందడి..

చెన్నైలో హృతిక్ సందడి..

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ చెన్నైలో సందడి చేశాడు. హృతిక్ రోషన్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆయన బాడీ, ఆయన డ్యాన్సులే. ఫిజిక్ మెయింటెన్ చేయడంలో ఆయన తరువాతే ఎవ్వరైనా.. బాలీవుడ్‌లో ఆయనలా స్టెప్పులు వేసే హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

Recommended Video

Allu Arjun's Ala Vaikuntapuram Lo Story Out | ‘అల.. వైకుంఠపురములో టీజర్ ఎప్పుడంటే | Filmibeat Telugu
వారేం తింటారో తెలుసుకోవాలి..

వారేం తింటారో తెలుసుకోవాలి..

దక్షిణాదిలో దళపతి విజయ్ అద్భుతమైన స్టెప్ప్ వేస్తాడని, షూటింగ్‌కు వెళ్లేముందు ఏం తింటారో తెలుసుకోవాలని హృతిక్ అన్నాడు. ఇక మరో సౌత్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ఓ మై గాడ్..ఆయన ఎనర్జీ చాలా బాగుంటుంది.. ఎంతో స్ఫూర్తిధాయకమైన వ్యక్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X